పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిరసన

By narsimha lodeFirst Published May 13, 2020, 11:00 AM IST
Highlights

పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ కార్యాలయంలో బుధవారం నాడు దీక్షకు దిగారు.


హైదరాబాద్: పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ కార్యాలయంలో బుధవారం నాడు దీక్షకు దిగారు.

హైద్రాబాద్ నాంపల్లి పార్టీ కార్యాలయంలో  ఇవాళ ఉదయం  9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్షను కొనసాగించనున్నారు బండి సంజయ్.

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవో కారణంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని బీజేపీ నేతలు అబిప్రాయపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణకు నష్టం కల్గించేలా వ్యవహరిస్తున్నా కూడ తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టిపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.

also read:పోతిరెడ్డిపాడుపై తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు: కేసీఆర్ పై భట్టి విమర్శలు

పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని అడ్డుకోకపోవడం కేసీఆర్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.  ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచాలని నిర్ణయం తీసుకొంది.

ఈ మేరకు రూ. 6,287 కోట్లకు పరిపాలన ఆమోదం తెలుపుతూ ఏపీ ప్రభుత్వం ఈ నెల 5వ తేదీన జీవో జారీ చేసింది. ఈ జీవోపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలిపింది. మరో వైపు తెలంగాణలోని పలు పార్టీలు కూడ ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోపై కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించాయి.

click me!