తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు పంతం నెగ్గించుకున్నారు. ప్రొటెం స్పీకర్‌గా నియామకమైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రమాణం తీసుకోబోమని భీష్మించుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు నేడు.. అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ నియామకమైన తర్వాత ఆయనతో ప్రమాణం తీసుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు పంతం నెగ్గించుకున్నారు. అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రమాణం చేయించుకోబోమని మొండికేసిన బీజేపీ ఎమ్మెల్యేలు నేడు పూర్తిస్థాయి స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. అయితే, శాసన సభలో బీజేపీకి ఇంకా ఎల్పీ నేత లేకపోవడం గమనార్హం. ఇంకా వారు శాసన సభాపక్ష నేతను ఎన్నుకోలేదు.
శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నియమించారు. శాసనసభలోని ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనతో తాము ప్రమాణ స్వీకారం తీసుకోబోమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలంతా ప్రమాణం తీసుకున్నప్పుడు వారు అసెంబ్లీని బహిష్కరించారు. తాజాగా నేడు ప్రమాణం తీసుకున్నారు.
నేడు తెలంగాణ మూడో అసెంబ్లీకి వికారాబాద్ ఎమ్మెల్యే, దళిత నేత గడ్డం ప్రసాద్ కుమార్‌ను స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ఎంచుకున్న నిర్ణయానికి బీఆర్ఎస్ కూడా మద్దతు తెలుపడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది.
గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం తీసుకున్నారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లు ఈ రోజు ప్రమాణం తీసుకున్నారు.