తీవ్ర ఆందోళన క‌లిగిస్తోంది.. పార్ల‌మెంట్ దాడిపై సీఎం రేవంత్ రెడ్డి

Published : Dec 14, 2023, 04:17 PM IST
తీవ్ర ఆందోళన క‌లిగిస్తోంది.. పార్ల‌మెంట్ దాడిపై సీఎం రేవంత్ రెడ్డి

సారాంశం

Anumula Revanth Reddy: పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘనను మన ప్రజాస్వామ్య విలువలపై దాడిగా తెలంగాణ ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి అభివ‌ర్ణించారు. స‌మగ్ర విచారణ జరిపి ఈ చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు.  

Parliamentar Security Breach: పార్లమెంటు జీరో అవర్ లో ఇద్దరు వ్యక్తులు క‌ల‌ర్ గ్యాస్ డ‌బ్బాలతో సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్ సభ ఛాంబర్ లోకి దూసుకెళ్లి గంద‌ర‌గోళం సృష్టించారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి అని అన్నారు. "ఇది కేవలం పార్లమెంటు భవనంపై దాడి మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలపై దాడి" అని 'ఎక్స్'లో రేవంత్ రెడ్డి స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు.

మరోవైపు, పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కూడా ఖండించింది. లోక్ సభలో ఇద్దరు యువకులు గ్యాలరీ నుంచి దూకి గ్యాస్ విసిరిన ఘటనను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.  కాగా, 2001లో పార్లమెంటుపై జరిగిన దాడిని దేశం గమనిస్తున్న సమయంలోనే ఈ ఉల్లంఘన జరిగింది. ఎంపీలందరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నామని, దోషులను శిక్షించాలని కోరుతున్నామన్నారు. 
 

Lok sabha Security Breach: ప‌నిలేకే పార్ల‌మెంట్ పై దాడి చేశారా?

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్