మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. రాజాసింగ్ చేసన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎంఐఎం ఆందోళనకు దిగింది.
హైదరాబాద్: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాసింగ్ ను ఆయన ఇంటి వద్దే పోలీసులు అరెస్ట్ చేశారు. మునావర్ ఫరూఖీ షో ను నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం నేతలు ఆరోపించారు. ఈ విషయమై రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైద్రాబాద్ సీపీ కార్యాలయం ముందు ఎంఐఎం నేతలు ఆందోళనకు దిగారు. సోమవారం నాడు రాత్రి నుండి మంగళవారం నాడు ఉదయం వరకు ఆందోళన సాగించారు. మునావర్ ఫరూఖీ షో నిర్వహించవద్దని తాము కోరినా కూడా పోలీసుల రక్షణతో ఈ షో నిర్వహించడాన్ని రాజాసింగ్ తప్పు బట్టారు. ఈ విషయమై డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మరో వైపు హైద్రాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లలో రాజాసింగ్ పై ఫిర్యాదులు అందాయి.
also read:మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు: వీడియోను తొలగించిన యూట్యూబ్
undefined
తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఎంఐఎం ఆందోళనకు దిగారు. పోలీసుల వినతి మేరకు రాజాసింగ్ అప్ లోడ్ చేసిన వీడియోను యూట్యూబ్ తొలగించింది. అయితే తాను ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని రాజాసింగ్ ప్రకటించారు. మునావర్ ఫరూఖీ శ్రీరాముడు, సీతలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు. కానీ తాను మాత్రం ఎవరి పేరును తీసుకొని వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఈ విషయమై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకొన్నా తాను సిద్దమేనని ప్రకటించారు.
ఈ నెల 20వ తేదీన మునావర్ ఫరూఖీ షో నిర్వహణకు పోలీసులు అనుమతించడాన్ని రాజాసింగ్ తప్పు బట్టారు.ఈ షో నిర్వహిస్తే అడ్డుకొంటామని హెచ్చరించారు.ఈ షో నిర్వహించవద్దని కూడా బీజేవైఎం నేతలు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. కానీ ఈ షో నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.పోలీసుల రక్షణతో ఈ షో నిర్వహించారు. ఈ షో నిర్వహణను అడ్డుకొంటామని బీజేపీ నేతలు ప్రకటించారు. ధర్మం కోసమే తాను ఈ షో నిర్వహణకు అడ్డుపడుతామని రాజాసింగ్ ప్రకటించారు. ధర్మం కోసం తాను ప్రయత్నిస్తానని చెప్పారు. పార్టీ కంటే తనకు ధర్మమే ముఖ్యమని ఆయన చెప్పారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ పై నమోదైన కేసుల నేపథ్యంలో రాజాసింగ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మంగళవారం నాడు ఉదయం రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారని సమాచారం. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందునే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం తెలిపింది.