గుమ్మ‌డి కాయ‌ల దొంగ మాదిరి... దర్యాప్తు సంస్థలంటే ఎందుకంత భయం : కేటీఆర్‌కు రఘునందన్ రావు కౌంటర్

Siva Kodati |  
Published : Jun 11, 2022, 03:47 PM ISTUpdated : Jun 11, 2022, 03:48 PM IST
గుమ్మ‌డి కాయ‌ల దొంగ మాదిరి... దర్యాప్తు సంస్థలంటే ఎందుకంత భయం : కేటీఆర్‌కు రఘునందన్ రావు కౌంటర్

సారాంశం

విపక్షాలపై బీజేపీ దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటరిచ్చారు. ద‌ర్యాప్తు సంస్థ‌లు అంటే ఎందుకు ఉలికిప‌డుతున్నారోనంటూ సెటైర్లు వేశారు. 

తెలంగాణ బీజేపీ (bjp) - టీఆర్ఎస్ (trs) నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విప‌క్షాల‌పై రాజ‌కీయ దురుద్దేశాల‌తోనే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడులు చేయిస్తున్నార‌న్న కేటీఆర్‌ (ktr) ట్వీట్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (raghunandan rao) కౌంటరిచ్చారు. గుమ్మ‌డి కాయ‌ల దొంగ అంటే భుజాలు త‌డుముకోవ‌డం అంటే ఇదేనేమోనంటూ ఆయన సెటైర్లు వేశారు. కేటీఆర్ ట్వీట్‌లోని ఆంతర్యం ఏమిటోనంటూ ప్ర‌శ్నించిన ర‌ఘునంద‌న్ రావు... ద‌ర్యాప్తు సంస్థ‌లు అంటే ఎందుకు ఉలికిప‌డుతున్నారోనంటూ కామెంట్స్ చేశారు.

అంత‌కుముందు, దేశంలో 30 ఏళ్లలో కులపిచ్చి, మతపిచ్చి ఎక్కువైందని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఖమ్మంలో పర్యటించిన ఆయన అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ రాకముందు ఖమ్మం పట్టణం ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. ఖమ్మం కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ది మరో కార్పొరేషన్‌లో జరగడం లేదన్నారు. ఆయన ప్రాంతం అభివృద్ది చెందాలనే తపన ఉన్న నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ అని అన్నారు.  అదే సమయంలో కేంద్రంలోని బీజేపీపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. 

Also Read:KTR: ప్ర‌తిప‌క్షాలు టార్గెట్ గా కేంద్ర ఎజెన్సీల దాడులు.. బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్

దేశంలో కులం, మతం పేరుతో చిచ్చు పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగోడుతుందని మండిపడ్డారు. మతం చిచ్చుపెట్టి.. ఆ మంటల్లో చాలికాచుకుంటుందని విమర్శించారు. విద్వేషం తప్ప మరేదానిపై బీజేపీకి చిత్తశుద్ది లేదన్నారు. ఇతర మతాలపై విషయం చిమ్మే వ్యక్తులు రాజకీయ నాయకులు ఎలా అవుతారని ప్రశ్నించారు. దేశంలో ఎందుకు ఈ విపరీత ధోరణులు ఎందుకు కనిపిస్తున్నాయో ఆలోచన చేయాలన్నారు. 

కాగా, గత కొన్ని నెలలుగా ప్రతిపక్ష సభ్యులపై కేంద్ర ఏజెన్సీల దాడులు ఎక్కువయ్యాయి. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఈడీ కస్టడీకి పంపారు. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను జూన్ 9 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి మంగళవారం ఇక్కడి కోర్టు పంపింది. ఈడీ కేసులో జైన్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ ముందు హాజరుపరిచారు. ఈ కేసులో ఆయనను సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు.  జైన్ బంధువులకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈడీ అటాచ్ చేసింది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu