ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా?.. ఇదే మంచి అవకాశం: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి సెటైర్లు

Published : Jun 11, 2022, 03:17 PM IST
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా?.. ఇదే మంచి అవకాశం: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి సెటైర్లు

సారాంశం

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు వేధింపుల్లో భాగమేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కుట్ర ప్రకారమే వారిపై కేసు పెట్టారని విమర్శించారు. 

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు వేధింపుల్లో భాగమేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కుట్ర ప్రకారమే వారిపై కేసు పెట్టారని విమర్శించారు. కేంద్రంలోని మోదీ విచారణ సంస్థల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక లావాదేవీలు జరగని కేసులో నోటీసులు ఇచ్చారని.. గతంలో మూసేసిన కేసును మళ్లీ తెరిచారని అన్నారు. దేశసమగ్రత కోసం గాంధీ కుటుంబం కృషి చేసిందని చెప్పారు. ప్రధాని పదవిని సైతం త్యాగం చేసిన కుటుంబానికి ఈడీ నోటీసులు ఇచ్చారని తెలిపారు. 

నేషనల్ హెరాల్డ్‌లో అవకతవకలు జరగలేదని 2015లో కేంద్రం చెప్పిందన్నారు. జాతీయ సమగ్రత కోసం నేషనల్ హెరాల్డ్ పత్రిక నడుపుతున్నారని చెప్పారు. యంగ్ ఇండియా ట్రస్ట్ ద్వారా నేషనల్ హెరాల్డ్ పత్రిక నడుపుతున్నారని తెలిపారు. నేషనల్ హెరాల్డ్‌లో ఆర్థిక అవకతవకలు, అక్రమాలు జరగలేదని అన్నారు. 

గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు మళ్లీ కేసును తిరగదోడారు. దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. కులాలు, మతాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ వాట్సప్ యూనివర్సిటీ ద్వారా విద్వేషాలను రెచ్చగొడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలపై పోరుబాట పట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. 

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ చేస్తా అని కేసీఆర్ అంటున్నాడు.. కానీ ప్రజలు ఆయనకు వీఆర్‌ఎస్ ఇస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అనుకోకుండా సీఎం అయ్యారని విమర్శించారు. కేసీఆర్ అభ్యర్థులను పెట్టి ప్రచారం చేయగలడా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన పాత్రను పెద్దగా చూపించుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో కేసీఆర్‌ను ఎవరూ సీరియస్‌గా పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్‌వి చిల్లర మల్లర ప్రయత్నాలు అని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ లేదన్నప్పుడు కాంగ్రెస్ కాళ్లు ఎందుకు పట్టుకున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఎక్స్‌పైర్ అయిన మెడిసిన్.. కేసీఆర్ అనే ఔషధానికి కాలం చెల్లిందని కామెంట్ చేశారు. కాలం చెల్లిన మందు వాడితే రియాక్షన్స్ ఉంటాయని అన్నారు. ఇక్కడ ఎక్స్‌పైర్ అయిన మెడిసిన్ లేబుల్ మార్చాలనుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో జోకర్‌గా చూస్తున్నారని.. ఆయనకు జాతీయ నేతలు మర్యాద కోసం కూర్చోబెట్టి టీ ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీని విస్తరించాలనుకుంటే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీతో ముందుకు వెళ్లాలనుకుంటున్న కేసీఆర్‌కు ఆత్మకూరు ఎన్నిక మంచి అవకాశం అని సైటెర్లు వేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్