ఈ నెల 15 లేదా 16 తేదీల్లో అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది.35 మందితో అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉంది.
హైదరాబాద్: ఈ నెల 15 లేదా 16 తేదీల్లో బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.35 మందితో తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. గత నెల 4 నుండి 10వ తేదీ వరకు ఆశావాహుల నుండి బీజేపీ నాయకత్వం ధరఖాస్తులను ఆహ్వానించింది. సుమారు ఆరు వేలకు పైగా ధరఖాస్తులు అందాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 66 మంది ధరఖాస్తు చేసుకున్నారు.
also read:వచ్చే వారంలో బీజేపీ అభ్యర్థుల జాబితా: 30 మందికి చోటు దక్కే అవకాశం
undefined
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై కూడ బీజేపీ నాయకత్వం కేంద్రీకరించింది. ఈ నెల మొదటి వారం నుండి బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నెల 1, 3 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించారు.ఈ నెల 1న మహబూబ్ నగర్, ఈ నెల 3న నిజామాబాద్ లో నిర్వహించిన సభలో మోడీ ప్రసంగించారు. ఈ నెల 6న హైద్రాబాద్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
also read:ఆరువేలకు పైగా ధరఖాస్తులు: ఆ రెండు అసెంబ్లీ స్థానాలకు భారీగా ధరఖాస్తులు
ఈ నెల 10వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 10న ఆదిలాబాద్ లో జరిగే సభలో అమిత్ షా పాల్గొంటారు.మరో వైపు ఈ నెలాఖరులో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ సభను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావిస్తుంది.