టీఎన్జీవోలపై రాష్ట్ర ఎన్నికల అధికారికి బీజేపీ నేతల ఫిర్యాదు.. వారిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్..

Published : Oct 31, 2022, 05:12 PM IST
టీఎన్జీవోలపై రాష్ట్ర ఎన్నికల అధికారికి బీజేపీ నేతల ఫిర్యాదు.. వారిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్..

సారాంశం

టీఎన్జీవోలపై రాష్ట్ర ఎన్నికల అధికారికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సర్వీసు రూల్స్‌కు విరుద్దంగా టీఎన్జీవో నేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

టీఎన్జీవోలపై రాష్ట్ర ఎన్నికల అధికారికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సర్వీసు రూల్స్‌కు విరుద్దంగా టీఎన్జీవో నేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే మునుగోడు లో ఉన్న బీజేపీ నాయకుల ఫోన్ ట్యాపింగ్  వ్యవహారంపై ఫిర్యాదు చేశామని కూడా ఆ పార్టీ నేతలు చెప్పారు. రాజగోపాల్ రెడ్డి కంపెనీకి సంబంధించిన అకౌంట్లన్నీ ఫేక్ అని.. అవి ఎలా బయటికి వచ్చాయో చర్యలు తీసుకోవాలని కోరినట్టుగా తెలిపారు. 

బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు రాజేంద్రతోపాటు వారి సంఘం అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగికి సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా ప్రచారం చేసినందుకు వారిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సమయంలోనూ కూడా టీఎన్జీవోలు ఈ విధంగానే అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సందర్భంగా ఒక రాజకీయ పార్టీకి టీఎన్జీవో సంఘం మద్దతు ఇచ్చి నందుకు ఫైన్ వేశారని చెప్పారు. 

అవసరమైతే వారిపై తాము క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిష్టిబొమ్మ దగ్ధం చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేకుంటే దానిపైన తాము పోరాటం చేస్తామని చెప్పారు. న్యాయస్థానంలోనూ పోరాటం చేస్తామని తెలిపారు. ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఈ విధంగా వ్యవహరించడం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. 

రాజగోపాల్ రెడ్డి అకౌంట్ నుండి డబ్బులు బదిలీ అని వచ్చిన ఆరోపణలపై ఎన్నికల అధికారులకు వివరణ ఇచ్చినట్టుగా చెప్పారు. అవన్నీ ఫేక్ అకౌంట్లు అని.. ఒక వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఏ విధంగా బయటికి వచ్చాయని ప్రశ్నించారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల అధికారులను కోరినట్టుగా చెప్పారు. 

బీజేపీ లీగల్ సెల్ నాయకురాలు రచనా రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసేలా టిఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సుశీ సంస్థలో డైరెక్ట్ గా లేనని రాజా గోపాల్ రెడ్డి చెప్తున్నారని అన్నారు. బయటికి వచ్చినటువంటి అకౌంట్‌లు ఫేక్.. అవన్నీ టీఆర్ఎస్ సృష్టించిందని తాము అనుకుంటున్నామని చెప్పారు. ఎవరి అకౌంట్లో అయితే డబ్బులు జమ చేశారని ఆరోపించారో వారి స్టేట్మెంట్లు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయని.. ఉద్యోగులు బహిరంగంగా ఎలాంటి పొలిటికల్ పార్టీకి ప్రచారం చేయవద్దని అన్నారు. టీఎన్జీవో అసోసియేషన్‌పై క్రిమినల్ చర్యలు, డీసిప్లిన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సమయంలో చేసిన తప్పే మునుగోడు ఎన్నికల్లోను చేస్తున్నారని విమర్శించారు. మునుగోడులో ఉన్న బీజేపీ నాయకుల ఫోన్ ట్యాపింగ్  వ్యవహారంపై ఫిర్యాదు చేశామని చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే