భద్రాద్రి జిల్లాలో ఉద్రిక్తత: సోంపల్లిలో పోడు రైతులు, అటవీశాఖాధికారుల మధ్య ఘర్షణ

By narsimha lode  |  First Published Oct 31, 2022, 3:40 PM IST

భద్రాద్రి కొత్తగూడెం  జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం సోంపల్లిలో పోడు రైతులు  అటవీశాఖాధికారుల  మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఫారెస్ట్ అధికారులు నాటిన మొక్కను పోడు రైతులు  తొలగించారు.


భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  బూర్గంపహాడ్ మండలం సోంపల్లిలో పోడు రైతులు, అటవీ శాఖాధికారుల మధ్య సోమవారంనాడు ఘర్షణ చోటు చేసుకుంది. పోడు భూముల్లో అటవీ శాఖాధికారులు నాటిన మొక్కలను రైతులు తొలగించారు. దీంతో  అటవీశాఖాధికారులు ,పోడు రైతుల మధ్య ఘర్షణ చోటు  చేసుకుంది. అధికారులు,  రైతుల మధ్య తోపులాట  చోటు చేసుకుంది. అటవీశాఖాధికారులపై పోడు రైతులు  దాడికి యత్నించారు.

ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి  చేరకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. రాష్ట్రంలోని ఏజెన్సీప్రాంతంలో పోడు భూముల  అంశంపై ఆందోళనలు సాగుతున్నాయి. పోడు భూముల సమస్యకు  పరిష్కారం కల్పిస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు.పోడు రైతులకు  అటవీ శాఖాధికారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.పోడు రైతులకు ,అటవీశాఖాధికారుల మధ్య  తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  ఘర్షణలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.

Latest Videos

undefined

కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబర్ 25న  ఆశ్వరావుపేట మండలం గాండ్లగూడెంలో  ఫారెస్ట్ అధికారులు పోడు రైతుల మధ్య ఘర్షణ జరిగింది.అటవీశాఖాధికారులు గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు రోడ్డుపై అడ్డంగా పడుకొని నిరసనకు దిగారు. ఇదే మండలంలో సెప్టెంబర్ 20 వ తేదీన బండారుగుంపు గ్రామంలో పోడు రైతులు ,అటవీశాఖాధికారుల మధ్య ఘర్షణ జరిగింది.

పోడు సాగు పేరుతో అడవులకు నష్టం చేస్తున్నారని గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు విమర్శలు చేస్తున్నారు.ఈ విషయమై   అన్ని పార్టీల నేతలతో చర్చించి నిర్ణయం తీసుకొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

also read:భద్రాద్రి కొత్తగూడెంలో పోడు వివాదం: అటవీ శాఖాధికారులను అడ్డుకున్న గాండ్లగూడెం వాసులు

పోడు భూముల అంశంపై తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ మాసంలో140 జీవోను విడుదల చేసింది. ఈ కమిటీలో  జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ఈ కమిటీలో రాజకీయ పార్టీల నేతలకు అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ భద్రాచలానికి చెందిన శంకర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి  సమావేశాలు నిర్వహించవద్దని తెలంగాణ హైకోర్టు  ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 


 

click me!