ఉద్యమకారులపై కేసులు: నాంపల్లి కోర్టుకు హాజరైన విజయశాంతి

Published : Apr 01, 2021, 02:54 PM IST
ఉద్యమకారులపై కేసులు: నాంపల్లి కోర్టుకు హాజరైన విజయశాంతి

సారాంశం

ఉద్యమకారులపై తెలంగాణ ప్రభుత్వం కేసులు పెడుతోందని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు.

హైదరాబాద్: ఉద్యమకారులపై తెలంగాణ ప్రభుత్వం కేసులు పెడుతోందని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు.గురువారంనాడు నాంపల్లి కోర్టుకు ఆమె హాజరయ్యారు.  2012లో మహబూబ్‌నగర్ లో టీఆర్ఎస్ నిర్వహించిన సభకు అనుమతి లేదని నమోదైన కేసులో విజయశాంతి ఇవాళ కోర్టుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 2012లో తాను టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ లో నిర్వహించిన టీఆర్ఎస్ సభలో పాల్గొన్నట్టుగా చెప్పారు. అయితే ఈ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనే విషయాన్ని కేసీఆర్ చూసుకోవాలన్నారు. కానీ అనుమతి లేని సభలో పాల్గొన్నారని తనపై కేసు పెట్టడాన్ని ఆమె తప్పు బట్టారు.

2012లో కేసు నమోదైతే ఇన్ని ఏళ్లు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు.ఇలాంటి కేసులకు తాను  భయపడడని ఆమె చెప్పారు. ఇలానే చేస్తే జనం చూస్తూ ఊరుకోరని ఆమె చెప్పారు. బీజేపీలో చ ేరిన తర్వాత కేసీఆర్ పై ఆమె విమర్శల జోరును మరింత పెంచారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave : హమ్మయ్యా..! ఇక చలిగండం గట్టెక్కినట్లేనా..?
Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవులు 9 కాదు 6 రోజులే..? తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్