కవితను అరెస్ట్ చేస్తారని భయం కేసీఆర్‌కు పట్టుకుంది: విజయశాంతి

By narsimha lode  |  First Published Mar 6, 2023, 3:23 PM IST

రాష్ట్రంలో  మహిళలపై దాడులు , దౌర్జన్యాలపై  నోరు మెదపని కేసీఆర్ ... మనీష్ సిసోడియా  అరెస్ట్  గురించి స్పందించడాన్ని బీజేపీ నేత విజయశాంతి తప్పుబట్టారు.  


హైదరాబాద్: లిక్కర్ స్కాంలో  ఎక్కడ తన కూతురును  అరెస్ట్  చేస్తారోననే భయం  కేసీఆర్ కు పట్టుకుందని  బీజేపీ నేత  విజయశాంతి  చెప్పారు.తెలంగాణలో  మహిళలపై  జరుగుతున్న  దాడులు, దౌర్జన్యాలను  నిరసిస్తూ  బీజే కార్యాలయంలో  బండి సంజయ్   సోమవరం నాడు దీక్షకు దిగాడు. ఈ దీక్షలో  బీజేపీ  నేత విజయశాంతి  పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతుంటే   కేసీఆర్  కనీసం స్పందించలేదన్నారు. కానీ  మనీష్ సిసోడియా లిక్కర్ స్కాంలో  అరెస్ట్ కాగానే  కేసీఆర్  ఎందుకు  స్పందించాడని  ఆమె  ప్రశ్నించారు.  లిక్కర్ స్కాంలో  కవితను కూడా పోలీసులు అరెస్ట్  చేస్తారనే  భయం కేసీఆర్ కు పట్టుకుందని ఆమె  ఆనుమానం వ్యక్తం  చేశారు.  రాష్ట్రంలో  మహిళలకు  ఏం జరిగినా కూడా కేసీఆర్ పట్టడం లేదన్నారు. కానీ తన కూతురు  గురించి ఆందోళన ఆయనకు  ఉందని  అర్ధమౌతుందన్నారు. 

రాష్ట్రంలో  ఇటీవల కాలంలో  వరుసగా  విద్యార్ధినుల ఆత్మహత్యలు  చోటు  చేసుకున్నాయి. మహిళలపై అత్యాచారాలు, హత్యలు కూడా  రోజు రోజుకి  పెరిగిపోతున్నాయని బీజేపీ నేతలు విమర్శలు  చేస్తున్నారు.   వీటిని  అరికట్టాలని కోరుతూ  బండి సంజయ్  దీక్షకు దిగాడు.  పార్టీకి చెందిన  నేతలు  సంజయ్ దీక్షకు మద్దతు ప్రకటించారు. 

Latest Videos

undefined

దేశ వ్యాప్తంగా  ఢిల్లీ లిక్కర్ స్కాం   కలకలం రేపుతుంది. ఈ కేసులో  ఎప్పుడు  ఎవరని  దర్యాప్తు సంస్థలు అరెస్ట్  చేస్తాయనే   ఉత్కంఠ  నెలకొంది.   ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సౌత్ లాబీయింగ్   కీలకంగా వ్యవహరించిందని  దర్యాప్తు సంస్థలు  అనుమానిస్తున్నాయి.ఈ విషయమై  దర్యాప్తు  సంస్థలు  రెండు తెలుగు రాష్ట్రాలకు  చెందిన  కొందరు  ఇప్పటికే  అరెస్టైన విషయం తెలిసిందే.  

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  రెండో  చార్జీషీట్ లో    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత  పేరును కూడా చేర్చాయి దర్యాప్తు సంస్థలు . కవితతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ,. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్లను చేర్చాయి దర్యాప్తు సంస్థలు .  వారం రోజుల క్రితం  మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు.   ఇవాళ మనీష్ సిసోడియా కు రిమాండ్ ను పొడిగిస్తూ  కోర్టు  ఆదేశాలు జారీ చేసింది. 

also read:ఢిల్లీ లిక్కర్ స్కాం : మనీష్ సిసోడియాకు చుక్కెదురు .. సీబీఐ కస్టడీ పొడిగింపు, బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

మరో వైపు  ఈ కేసులో  ఏపీ రాష్ట్రానికి  చెందిన వైసీపీ ఎంపీ  మాగుంట శ్రీనివాసులు రెడ్డి  తనయుడు  రాఘవరెడ్డి అరెస్టయ్యారు. హైద్రాబాద్ కు చెందిన  ప్రముఖ ఆడిటర్  బుచ్చిబాబును కూడా  దర్యాప్తు  సంస్థలు అరెస్ట్  చేశాయి.  
 

click me!