అచ్చంపేట గురుకుల స్కూల్‌లో దారుణం: బంధించి టెన్త్ విద్యార్ధులను చితకబాదిన ఇంటర్ స్టూడెంట్స్

By narsimha lode  |  First Published Mar 6, 2023, 2:35 PM IST

నాగర్ కర్నూల్  జిల్లాలోని అచ్చంపేట  సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెన్త్  క్లాస్  విద్యార్ధులపై   ఇంటర్ విద్యార్ధులు  దాడి  చేశారు.  బాధిత విద్యార్ధుల  పేరేంట్స్  స్కూల్ ఎదుట  ఆందోళనకు దిగారు.  


నాగర్ కర్నూల్: జిల్లాలోని  అచ్చంపేట  సాంఘిక  సంక్షేమ గురుకుల పాఠశాలలో  టెన్త్ క్లాస్  విద్యార్ధులపై  ఇంటర్ విద్యార్ధులు దాడి చేశారు. రెండు  రోజుల పాటు  టెన్త్ క్లాస్ విద్యార్ధులపై దాడి  చేశారు.  ఈ విషయం తెలుసుకున్న టెన్త్ క్లాస్  స్టూడెంట్ పేరేంట్స్   సాంఘిక  సంక్షేమ గురుకుల పాఠశాల  వద్దకు  వచ్చి  ఆందోళనకు దిగారు.  టెన్త్ క్లాస్  విద్యార్ధులపై దాడికి దిగిన  ఇంటర్ విద్యార్ధులపై  చర్యలు తీసుకోవాలని  బాధిత  విద్యార్ధుల  తల్లిదండ్రులు  కోరుతున్నారు. 

టెన్త్ క్లాస్  విద్యార్ధులను  గదిలో నిర్భంధించి  దాడి  చేశారని బాధితులు  చెబుతున్నారు. 20 మంది  టెన్త్ క్లాస్  విద్యార్ధులను  గదిలో  నిర్భంధించి  దాడి  చేశారని  బాధితులు  చెబుతున్నారు.   తాము చెప్పినట్టు వినాలని ఇంటర్ విద్యార్ధులు  తమపై దాడి చేసినట్టుగా బాధిత విద్యార్ధులు   చెబుతున్నారు.

Latest Videos

రెండు రోజుల పాటు  టెన్త్ విద్యార్దులను  ఇంటర్ స్టూడెంట్స్ కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న టెన్త్ క్లాస్ విద్యార్ధుల పేరేంట్స్  స్కూల్ ముందు  ఇవాళ ధర్నాకు దిగారు.  ఇంటర్ విద్యార్ధుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై  విచారణ  జరుపుతున్నామని  అధికారులు  చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని  ప్రకటించారు. 

click me!