‘‘ మా ’’ ఎన్నికలు.. లోకల్- నాన్ లోకల్ వివాదం, నా మద్ధతు సీవీఎల్‌కే: విజయశాంతి

Siva Kodati |  
Published : Jun 27, 2021, 08:56 PM IST
‘‘ మా ’’ ఎన్నికలు.. లోకల్- నాన్ లోకల్ వివాదం, నా మద్ధతు సీవీఎల్‌కే: విజయశాంతి

సారాంశం

మా ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి స్పందించారు. లోకల్, నాన్ లోకల్ వివాదం నేపథ్యంలో సీవీఎల్ నరసింహారావును తాను సమర్థిస్తున్నట్లు విజయశాంతి స్పష్టం చేశారు. 

మా ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి స్పందించారు. లోకల్, నాన్ లోకల్ వివాదం నేపథ్యంలో సీవీఎల్ నరసింహారావును తాను సమర్థిస్తున్నట్లు విజయశాంతి స్పష్టం చేశారు. సీవీఎల్ ఆవేదన న్యాయమైనదని ఆమె అన్నారు. తాను మా సభ్యురాలినీ కాకపోయినా ఒక కళాకారిణీగా స్పందిస్తున్నానని విజయశాంతి స్పష్టం చేశారు. 

కాగా, మా` ఎన్నికల్లో మరో కోణం వెలుగులోకి తీసుకొచ్చారు సీనియర్‌ నటులు సీవీఎల్‌ నర్సింహరావు. తాను కూడా `మా` అధ్యక్ష బరిలో దిగుతున్నట్టు ఓ వీడియో ద్వారా ఆదివారం ప్రకటించారు. పొరుగు కళాకారులతో తెలుగు ఆర్టిస్టులకు జరుగుతున్న అన్యాయాలపై ఆయన మందుకొచ్చాడు. తెలంగాణ కళాకారులను జరుగుతున్న అన్యాయంపై తాను ప్రశ్నించారు. 

Also Read:తెలంగాణ వాదంతో `మా` ఎన్నికల బరిలో సీనియర్‌ నటులు సీవీఎల్‌ నర్సింహరావు..

ఈ సారి `మా` ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా నర్సింహరావు రావడంతో ఐదుగురు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి `మా` ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. రోజు రోజుకు మారుతున్న పరిణామాలు మరింత ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తున్నాయి

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ