తెలంగాణ ఇంటర్ ఫలితాలు: రేపు విడుదల చేయనున్న సబితా ఇంద్రారెడ్డి

By Siva KodatiFirst Published Jun 27, 2021, 8:25 PM IST
Highlights

తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. కరోనా కారణంగా సెకండియర్ పరీక్షలు రద్దు కావడంతో ఏ ప్రాతిపదికన ఫలితాలు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది.

తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. కరోనా కారణంగా సెకండియర్ పరీక్షలు రద్దు కావడంతో ఏ ప్రాతిపదికన ఫలితాలు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. ఫస్ట్ ఇయర్ ఫలితాల ఆధారంగా సెకండియర్ ఫలితాలను ప్రకటించనుంది. ఇక ప్రాక్టీకల్స్‌కి వంద శాతం మార్కులు ఇవ్వనున్నారు.

Also Read:తెలంగాణ: ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులకు మార్కులు ఇలా.. మార్గదర్శకాలు ఇవే..!!

రేపు విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. జూలై 1 నుంచి విద్యా సంస్థల ప్రారంభం, ఆన్‌లైన్ తరగతుల మార్గదర్శకాలపై ఆమె సమీక్ష నిర్వహించనున్నారు. జూలైలో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలపైనా సబితా ఇంద్రారెడ్డి నిర్ణయం తీసుకోనున్నారు. స్కూళ్లు, జూనియర్ కాలేజీలతో పాటు డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కాలేజీల తరగతులు ఆన్‌లైన్‌లోనే నిర్వహించుకునేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. 

ఇప్పటికే ఇంటర్ సెకండియర్ మార్కులకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ విధివిధానాలను ఖరారు చేసింది. మొదటి సంవత్సరం వచ్చిన మార్కులనే సెకండియర్‌కు కూడా పరిగణనలోనికి తీసుకుంటామని చెబుతోంది. అలాగే ప్రాక్టీకల్స్‌కు వంద శాతం మార్కుల్ని కేటాయిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఫస్ట్ ఇయర్ బ్యాక్ లాగ్స్ వుంటే 35 శాతం మార్కులతో పాస్ చేస్తామని తెలిపింది. సెకండియర్‌లోనూ అదే సబ్జెక్ట్‌లకు 35 శాతం మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. పరీక్ష ఫీజు కట్టిన విద్యార్ధులకు 35 శాతం మార్కులతో  పాస్ చేస్తామని తెలిపింది.

click me!