షాద్‌నగర్‌లో విషాదం: భార్య కన్పించడం లేదని భర్త సూసైడ్

Published : Jul 01, 2023, 03:45 PM ISTUpdated : Jul 01, 2023, 04:58 PM IST
 షాద్‌నగర్‌లో విషాదం: భార్య కన్పించడం లేదని భర్త సూసైడ్

సారాంశం

రంగారెడ్డి జిల్లాలోని  షాద్ నగర్ లో విషాదం  చోటు  చేసుకుంది. భార్య కన్పించడం లేదని భర్త ఆత్మహత్య  చేసుకున్నాడు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని  షాద్ నగర్ లో  విషాదం  చోటు  చేసుకుంది.  భార్య  కన్పించడం లేదనే మనోవేదనతో  భర్త ఆత్మహత్య  చేసుకున్నాడు. భార్య కన్పించడం లేదని  పోలీసులకు  కూడ భర్త ఫిర్యాదు చేశాడు. అదృశ్యమైన  వివాహిత  కోసం  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా కూడ  వివాహిత  లభ్యం కాలేదు. దీంతో  భర్త  ఆత్మహత్య  చేసుకున్నాడు.  ఆత్మహత్యకు ముందు  ఆయన  సెల్ఫీ వీడియో రికార్డు  చేశాడు.  ఈ విషయమై  పోలీసులు కేసు నమోదు  చేశారు.

షాద్ నగర్ మండలం కొండన్నగూడం గ్రామానికి చెందిన రాజు, శ్వేత బార్యాభర్తలు, మూడు  రోజుల క్రితం నుండి రాజు భార్య కన్పించకుండా పోయింది.  దీంతో  రాజు మనోవేదనకు గురయ్యాడు. భార్య ఆచూకీ కోసం  రాజు  ప్రయత్నించాడు. పోలీసులకు  ఫిర్యాదు  చేశాడు.  ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో  ఇవాళ  తన తల్లి సమాధి వద్ద  ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?