
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై (kcr) విరుచుకుపడ్డారు బీజేపీ (bjp) నేత ఇంద్రసేనా రెడ్డి (indrasena reddy) శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు పోవాలన్న ఆలోచనలో వున్నారని జోస్యం చెప్పారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్‌ను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారని ఇంద్రసేనా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో (munugodu bypoll) బీజేపీ గెలిస్తే.. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్ధులు మిగలరని ఆయన వ్యాఖ్యానించారు. అబద్ధాలు చెప్పే ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా ఇంటికి పంపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా వున్నారని ఆయన అన్నారు. మునుగోడులో ఉపఎన్నికను ఎదుర్కోవడానికి కేసీఆర్ సిద్ధంగా లేరని ఇంద్రసేనా రెడ్డి వ్యాఖ్యానించారు.
మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఏడాది మొదటి నుంచే ఆయన రాష్ట్రానికి మూడు సార్లు వచ్చారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి షా కృషి చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీల నుంచి బీజేపీలోకి నాయకులను తీసుకొచ్చేందుకు ఆయన డైరెక్షన్ లోనే ప్లాన్ ల అమలు సాగుతోందని తెలుస్తోంది.
ప్రతీ జిల్లాలో బీజేపీకి ఒక స్ట్రాంగ్ లీడర్ అండగా ఉండేలా చూసుకోవాలని, దాని కోసం వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని రాష్ట్ర నాయకులకు అమిత్ షా సుమారు నెల రోజుల కిందట ఆదేశాలు ఇచ్చారని అర్థమవుతోంది. అయితే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను సర్వే బృందాలు ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో ఆయనకు పంపిస్తున్నట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగానే రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా సూచనలు చేస్తున్నారు.
ALso REad:తెలంగాణపై అమిత్ షా ఫోకస్.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు
‘ తెలంగాణ రాష్ట్రంలో అధిక మండలాల్లో బీజేపీకి కేడర్ ఉన్నప్పటికీ మంచి లీడర్ షిప్ లేదు. ఈ విషయం పలు సందర్భాల్లో స్పష్టంగా తెలుస్తోంది. అందుకు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకరిని సమన్వయకర్తగా నియమించాలి. ఈ విషయాన్ని మేము హైకమాండ్ కు చాలా రోజుల నుంచి తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు దానికి అనుగుణంగా హైకమాండ్ చర్యలు తీసుకుంటోంది’ అని బీజేపీ కి చెందిన నాయకుడు తెలిపారని ‘ఆంధ్రజ్యోతి’ తన కథనంలో పేర్కొంది.
బీజేపీ ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆయా జిల్లాల నుంచి నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకునేలా చూడాలని జాతీయ నాయకత్వం నుంచి సూచనలు వస్తున్నాయి. ఆ సూచనలకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం కూడా అడుగులు వేస్తోంది. ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఇంటర్నల్ ఇష్యూస్ బీజేపీకి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది.