జూపల్లికి డీకే అరుణ ఆహ్వానం: బీజేపీలో చేరాలని కోరిన కమలం నేత

By narsimha lode  |  First Published Apr 13, 2023, 11:35 AM IST

బీఆర్ఎస్  నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావుకు  బీజేపీ, కాంగ్రెస్ నేతలు  ఆఫర్లు ఇస్తున్నారు.  బీజేపీలో చేరాలని బీజేపీ నేత  డీకే అరుణ  ఇవాళ  జూపల్లి  కృష్ణారావును  ఆహ్వానించారు. 



హైదరాబాద్: మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావును  బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని  ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు  డీకే అరుణ  చెప్పారు. గురువారంనాడు  బీజేపీ జాతీయ  జాతీయ  ఉపాధ్యక్షురాలు  డీకే అరుణ  మీడియాతో మాట్లాడారు.  బీజేపీలో  చేరేందుకు  మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు  సానుకూలంగా  స్పందించారని  చెప్పారు. బీఆర్ఎస్ అసంతృప్తులు తమతో టచ్ లో ఉన్నారన్నారు.   జూపల్లి కృష్ణారావుతో  తనకు  మధ్య విబేధాలు లేవని ఆమె  స్పష్టం  చేశారు.  వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లాలో  కీలక పరిణామాలు  చోటు  చేసుకుంటాయని   ఆమె  చెప్పారు. 

గతంలో  తామిద్దరం  కాంగ్రెస్ పార్టీలో  ఉన్న సమయంలో  తమ మధ్య  వ్యక్తిగత  వైరం లేదన్నారు. సిద్దాంతపరమైన  విభేదాలే తమ మధ్య  ఉన్నాయని  ఆమె గుర్తు  చేసుకున్నారు.  తెలంగాణలో  కేసీఆర్ నేతృత్వంలో  బీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా  ఉండేందుకు గాను  తమతో కలిసి రావాలని    జూపల్లి కృష్ణారావును  ఆమె  కోరారు.   అయితే  జూపల్లి కృష్ణారావు  ఇందుకు సానుకూలంగా స్పందించినట్టుగా ఆమె  చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో  ఉన్న సమయంలో  కొల్లాపూర్ లో  హర్షవర్ధన్ రెడ్డి  గెలుపునకు  ప్రయత్నించినట్టుగా  డీకే అరుణ  చెప్పారు.   బీజేపీలో  చేరాలని  జూపల్లి కృష్ణారావుకు  ఫోన్  చేసి  ఆహ్వానించినట్టుగా  ఆమె  గుర్తు  చేశారు. బీజేపీలో  చేరేందుకు  జూపల్లి కృష్ణారావు  కూడా సానుకూలంగా  ఉన్నారని  ఆమె చెప్పారు. 

Latest Videos

also read:ఢిల్లీలోనే బండి , ఈటల మకాం: జూపల్లి సహా ముగ్గురు నేతల చేరికపై హైకమాండ్‌తో చర్చలు

ఉమ్మడి  ఏపీ రాష్ట్రంలో  డీకే అరుణ , జూపల్లి కృష్ణారావులు  కాంగ్రెస్ పార్టీలో  ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి,  రోశయ్య  కేబినెట్ లో  ఉన్నారు.  ఆ తర్వాత  చోటు  చేసుకున్న రాజకీయ పరిణామాల్లో  జూపల్లి కృష్ణారావు  కాంగ్రెస్ పార్టీకి  రాజీనామా  చేశారు.  తెలంగాణ కోసం  ఉమ్మడి  మహబూబ్ నగర్  జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు.  గద్వాల లోకి  జూపల్లి కృష్ణారావు  ప్రవేశించకుండా  పోలీసులు ఆయనను అరెస్ట్  చేశారు. ఆ సమయంలో  డీకే అరుణ  మంత్రిగా  ఉన్నారు.   ఆ తర్వాత  జూపల్లి  కృష్ణారావు  బీఆర్ఎస్ లో  చేరారు.  కొల్లాపూర్  లో  జరిగిన  ఉప ఎన్నికల్లో  బీఆర్ఎస్ తరపు  జూపల్లి కృష్ణారావు  పోటీ చేసి విజయంసాధించారు.  అయితే  ఆసమయంలో కాంగ్రెస్ అభ్యర్ధి  విష్ణువర్ధన్ రెడ్డి గెలుపునకు  డీకే అరుణ  పనిచేశారు.  ఆ తర్వాత  రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీకే అరుణ, బీజేపీలో  చేరారు. ప్రస్తుతం  జూపల్లి  కృష్ణారావుపై బీఆర్ఎస్  సస్పెన్షన్ వేటేసింది.  దీంతో  కృష్ణారావును బీజేపీలో  చేరాలని ఆమె ఆహ్వానించింది. 


 

click me!