చీమలపాడు ప్రమాదం వెనుక కుట్ర జరిగిందా లేదా దర్యాప్తులో తేలుతుంది: కేటీఆర్

Published : Apr 13, 2023, 11:20 AM ISTUpdated : Apr 13, 2023, 01:52 PM IST
చీమలపాడు ప్రమాదం వెనుక కుట్ర  జరిగిందా లేదా  దర్యాప్తులో  తేలుతుంది: కేటీఆర్

సారాంశం

ఖమ్మం జిల్లాలోని  చీమలపాడు  ఘటనలో  ప్రమాదానికి గురైన  క్షతగాత్రులను నిమ్స్ ఆసుపత్రిలో  మంత్రి కేటీఆర్  ఇవాళ పరామర్శించారు. 

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని  చీమలపాడు  ప్రమాదం  వెనుక  కుట్ర కోణం ఉందో  లేదా  దర్యాప్తులో తేలుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్  చెప్పారు. 
 చీమలపాడు ప్రమాదంలో  గాయపడిన  క్షతగాత్రులను  హైద్రాబాద్  నిమ్స్  ఆసుపత్రిలో  మంత్రి కేటీఆర్   గురువారంనాడు  పరామర్శించారు.  క్షతగాత్రుల  ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

 ఈ ప్రమాదంలో  ఇద్దరు బాధితులకు  శస్త్రచికిత్స  నిర్వహించనున్నారు వైద్యులు.  జిల్లాకు  చెందిన మంత్రి  పువ్వాడ అజయ్ , ఎంపీలు  నామా నాగేశ్వరరావు  రవిచంద్రలతో  కలిసి  మంత్రి కేటీఆర్ బాధితులను  పరామర్శించారు.  ఈ సందర్భంగా  మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో  మృతి చెందిన కుటుంబాలకు  ప్రభుత్వం  రూ.  10 లక్షల ఎక్స్ గ్రేషియాను  ప్రకటించిన విషయాన్ని  మంత్రి కేటీఆర్  గుర్తు చేశారు.  

also read:చీమలపాడు లో పేలుడు క్లూస్ టీమ్ ఆధారాల సేకరణ

ఈ ప్రమాదంలో  క్షతగాత్రులకు  మెరుగైన వైద్య సహాయం  అందిస్తామన్నారు.  మరో వైపు  ఈ ప్రమాదంలో  దివ్యాంగులుగా మారిన వారికి  చేయూత అందిస్తామని  మంత్రి  చెప్పారు.  క్షతగాత్రులు మనో ధైర్యం కోల్పోవద్దని  మంత్రి  కేటీఆర్  కోరారు.  ప్రభుత్వం, పార్టీ  అండగా  నిలుస్తుందని  కేటీఆర్ హామీ ఇచ్చారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?