నాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఇదే.. బోడిగె శోభ

Published : Nov 23, 2018, 10:55 AM IST
నాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఇదే.. బోడిగె శోభ

సారాంశం

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులపై బీజేపీ నేత బొడిగె శోభ మరోసారి విమర్శల వర్షం కురిపించారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులపై బీజేపీ నేత బొడిగె శోభ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. మొన్నటి వరకు టీఆర్ఎస్ లో కొనసాగిన ఆమె  తనకు టికెట్ ఇవ్వలేదన్న కారణంతో.. ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలసిందే.

కాగా.. తనకు టీఆర్ఎస్ లో టికెట్ దక్కకపోవడానికి గల కారణాన్ని ఆమె వివరించారు. తాను కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల కాళ్లు మొక్కలేదని.. అందుకే తనకు టికెట్ ఇవ్వలేదని ఆమె  అభిప్రాయపడ్డారు. 

ఒకప్పుడు కేసీఆర్ ని ఇష్టారాజ్యంగా తిట్టిపోసిన వాళ్లకి మంత్రి పదవులు కట్టబెట్టారని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఉద్యమకారులను అణచివేశారన్నారు. తెలంగాణలో పదవులు అనుభవిస్తూ.. ప్రజా ధనాన్ని కేసీఆర్ కుటుంబసభ్యులు దోచుకుతింటున్నారని ఆరోపించారు.

చొప్పదండి నియోజకవర్గంలో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ నేతల మద్యం, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారని ఆమె ఆరోపించారు. 

read more news

బొడిగె శోభను కరుణించని బీజేపీ... పార్టీ మారినా దక్కని టికెట్

కేసీఆర్ నన్ను మెడపట్టి గెంటేశారు.. బొడిగె శోభ

కేసీఆర్ టికెట్ ఇవ్వనందుకు అలక.. బీజేపీలోకి బొడిగె శోభ..?

వదిలిపెట్టను: కేసీఆర్ పై బొడిగె శోభ తిరుగుబాటు

పార్టీ మార్పుపై తేల్చేసిన బొడిగె శోభ

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్