తొలిసారి రాష్ట్రానికి:నేడు రాష్ట్రానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్

By narsimha lodeFirst Published Aug 26, 2022, 5:10 PM IST
Highlights

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తెలంగాణకు రానున్నారు. రేపు వరంగల్ లో జరిగే సభలో బన్సల్ పాల్గొంటారు. హైద్రాబాద్ నుండి  నేరుగా వరంగల్ కు చేరుకుంటారు. 

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా నియమితులైన తర్వాత తొలిసారిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునల్ బన్సల్  ఇవాళ తెలంగాణకు రానున్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా హైద్రాబాద్ కు చేరుకుని అక్కడి నుండి సునీల్ బన్సల్ వరంగల్ కు వెళ్తారు.  వరంగల్ లో రేపు జరిగే బీజేపీ సభలో సునీల్ బన్సల్ పాల్గొంటారు.

పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల పార్టీ ఇంచార్జీ బాధ్యతలను కూడ సునీల్ బన్సల్ కు జాతీయ నాయకత్వం అప్పగించింది. ఉత్తర్ ప్రదేశ్  రాష్ట్రంలో పార్టీ బాధ్యతల నుండి రిలీవ్ అయిన తర్వాత  మూడు రాష్ట్రాల బాధ్యతలను బన్సల్ కు అప్పగించింది జాతీయ నాయకత్వం. 2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలో అమిత్ షా కు సునీల్ బన్సల్ సహ ప్రముఖ్ గా పనిచేశారు.2014 ఎన్నికల్లో యూపీ రాష్ట్రం నుండి బీజేపీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. యూపీ రాష్ట్రంలో మంచి ఫలితాలు రావడంతో సునీల్ బన్సల్ ను తెలంగాణకు ఇంచార్జీగా నియమించింది బీజేపీ నాయకత్వం. 

తెలంగాణ రాష్ట్రంలో  పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే విషయమై సునీల్ బన్సల్ కీలక పాత్ర పోషించనున్నారు. సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో సునీల్ బన్సల్  దిట్టగా పేరుంది. తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితుల ఆధారంగా సునీల్ బన్సల్ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు సిద్దం చేయనున్నారు. సునీల్ బన్సల్ కేంద్ర మంత్రి అమిత్ షా కు అత్యంత సన్నిహితుడు. 

తెలంగాణపై బీజేపీ కేంద్రీకరించింది.వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది.  తెలంగాణకు అధిక సమయం కేటాయిస్తానని కూడ అమిత్ షా ప్రకటించారు. దీంతో అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నబన్సల్ ను ఇంచార్జీగా నియమించారనే చర్చ పార్టీలో సాగుతుంది.  పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే విషయమై సునీల్ బన్సల్ కేంద్రీకరించనున్నారు. పార్టీ ఇతర వ్యవహరాలపై తరుణ్ చుగ్ కేంద్రీకరించనున్నారు. 

తెలంగాణలో సంస్థాగత వ్యవహరాలపై గతంలో బీఎల్ సంతోష్ సమావేశం నిర్వహించారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాల్సిన  అవసరాన్ని సంతోష్ గుర్తించారు.ఈ క్రమంలోనే బన్సల్ ను  పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీగి నియమించారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.

click me!