వరంగల్ లో రేపు బీజేపీ సభ: తెలంగాణహైకోర్టు గ్రీన్ సిగ్నల్

By narsimha lodeFirst Published Aug 26, 2022, 4:40 PM IST
Highlights

రేపు వరంగల్ లో బీజేపీ సభకు  తెలంగాణ హైకోర్టు అనుమతిని ఇచ్చింది.  ఇవాళ బీజేపీ నేతలు ఈ విషయమై దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ నిర్వహించింది హైకోర్టు.  సభకు అనుమతిని ఇచ్చింది.

హైదరాబాద్: రేపు వరంగల్ లో బీజేపీ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించడంతో శుక్రవారం నాడు బీజేపీ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిసన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు వరంగల్ సభకు అనుమతిని ఇచ్చింది. 

ఇవాళ ఉదయం నుండి ఈ నెల 31వ తేదీ వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ ను అమల్లో ఉంటుందని వరంగల్ సీపీతరుణ్ జోషీ ప్రకటించారు. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. నిర్థీత సమయం లోపుగానే సభను పూర్తి చేయాలని హైకోర్టు బీజేపీ నేతలకు సూచించింది.రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని కూడా హైకోర్టు సూచించింది. 

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపును పురస్కరించుకొని రేపు వరంగల్ లోని ఆర్ట్స్ కాలేజీలో సభను ఏర్పాటు చేశారు.  అయితే ఈ సభకు పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. పోలీసులు అనుమతివ్వని కారణంగా ఆర్ట్స్ కాలేజీ  సిబ్బంది కూడ సభకు అనుమతివ్వలేదు. అయితే ఆర్ట్స్ కాలేజీలో  సభ కు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు పోలీసులు అనుమతివ్వని కారణంగా బీజేపీ నేతలు ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు  వరంగల్ లో సభ నిర్వహణకు అనుమతిని ఇచ్చింది.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సభలో పాల్గొంటారు.
 
హైకోర్టు అనుమతితోనే మూడు రోజుల విరామం తర్వాత బండి సంజయ్ పాదయాత్ర ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పున : ప్రారంభమైంది. రేపు భద్రకాళి అమ్మవారి ఆలయంలో బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది. ఈ యాత్ర ముగింపును పురస్కరించుకొని వరంగల్ లో సభను ఏర్పాటు చేసింది బీజేపీ.

also read:రేపు వరంగల్ లో బీజేపీ సభ: అనుమతికై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

తమ సభకు ఆటంకాలు కల్పించే ఉద్దేశ్యంతో పోలీసులను అడ్డుపెట్టుకొని టీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుందని బీజేపీ నేతలు విమర్శలు చేశారు.ఏసీపీ వద్దకు వెళ్తే సీపీ వద్దకు వెళ్లాలని తమను ఇబ్బందులు పెడుతున్నారని బీజేపీ నేతలు విమర్శలు చేశారు.ఈ కారణాలతోనే హైకోర్టును ఆశ్రయించామని బీజేపీ నేతలు గుర్తు చేశారు.  కోర్టులపై తమకు నమ్మకం ఉందని బండి సంజయ్ ప్రకటించారు. పాదయాత్ర ప్రారంభించిన సమయంలో రేపటి సభ విషయమై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా  కరూడా సభ నిర్వహిస్తామని బండి సంజయ్ తెలిపారు.


 

click me!