'వరి-ఉరి’పై బండి సంజయ్‌ దీక్ష

By narsimha lodeFirst Published Oct 28, 2021, 9:09 PM IST
Highlights

వరి సాగుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం నాడు పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మొదలైన ఈ నిరసన దీక్ష మద్యాహ్నం 2 గంటల దాకా కొనసాగింది.

 హైదరాబాద్‌: Paddy సాగు, రైతుల సమస్యలపై  Bjpరాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి Bandi Sanjayగురువారం రైతు దీక్ష చేపట్టారు.  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మొదలైన ఈ నిరసన దీక్ష మద్యాహ్నం 2 గంటల దాకా కొనసాగింది. వరి వేస్తే రైతుకు ఉరే అనే Trs ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బండి సంజయ్‌ ఈ దీక్ష చేపట్టారు.

also read:ఎందుకు వరి వద్దంటున్నారు.. సాగు చేస్తే ఉరి వేస్తారా: కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారని బండి సంజయ్ చెప్పారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదని బండి సంజయ్‌ విమ,ర్శించారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, రైతు వ్యతిరేక వైఖరి విడనాలని డిమాండ్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వరి-ఉరి ప్రభుత్వ వైఖరిపై ఈ రైతు దీక్ష చేపడుతన్నట్లు తెలిపారు.

బీజేపీ నేతలకు మంత్రి niranjan Reddy సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే kishan Reddy, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు.

మరోవైపు బీజేపీ నేతల విమర్శలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా తీవ్రంగానే స్పందించారు. యాసంగిలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేంద్రం నుండి లేఖ తీసుకురావాలని నిరంజన్ రెడ్డి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.రైతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరంజన్ రెడ్డి చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్‌, రైతుబంధు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

Huzurabad bypoll బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని చెప్పారు.వరి సాగు, వరి కొనుగోలు చేయటం లేదని బండి సంజయ్ దీక్షలు చేస్తున్నారన్నారు. ఏదో ఒక విధంగా ప్రచారం చేయాలని చెప్పారు. కేంద్రం ధాన్యాన్ని కొనలేమని, బాయిల్డ్ రైస్ కొనలేమని కేంద్ర మంత్రి చెప్పారన్నారు.. తెలంగాణ నుండి ఒక్క గింజ కొనం అని నిస్సిగ్గుగా చెప్పారని మంత్రి నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు.

కరోనా సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. గ్రామాల్లోని రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ ప్రయత్నం చేయలేదన్నారు. ఇదిలా ఉంటే సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. వరి విత్తనాలు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్నే కలెక్టర్ ప్రకటించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. వరి సాగును చేసే రైతులను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం పూనుకొందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ఓటేసి ఉరేసుకోవాల్సిన పరిస్థితులను రైతులు తెచ్చుకోవద్దన్నారు.

click me!