Huzurabad bypoll: ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై ఈసీ ఆరా

By narsimha lode  |  First Published Oct 28, 2021, 8:23 PM IST

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటర్లకు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది.ఈ విషయమై క్షేత్రస్థాయి అధికారుల నుండి  ఈసీ ఆరా తీసింది.


హైదరాబాద్: Huzurabad bypoll సందర్భంగా Voterలను ప్రలోభపెట్టేందుకు డబ్బులు, మద్యం సరఫరా చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నాడు ఆరా తీసింది.హూజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని Social Mediaలో  వీడియోలు వైరల్ గా మారాయి. కవర్లలో డబ్బులు తీసి లెక్కిస్తున్న దృశ్యాలు  నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.మరో వైపు వీణవంక మండలంలోని గంగారం  గ్రామంలో తమకు Currency ఇవ్వాలని కోరుతూ ఓటర్లు ఆందోళన నిర్వహించారు.

also read:ఓటర్లకు ప్రలోభాలు:హుజూరాబాద్ ఉపఎన్నిక రద్దుకై ఈసీకి కాంగ్రెస్ వినతి

Latest Videos

undefined

Bjp, Trs లు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని Congress ఆరోపించింది. ఓటర్లకు డబ్బులు పంచుతూ  ప్రలోభాలకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం సీఈసీని కలిసి  ఫిర్యాదు చేసింది.ఈ మేరకు సీఈసీకి  ఆధారాలను కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అందించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లోTrs, Bjp లు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఓటర్లను కొనుగోలు చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఈసీ దృష్టికి తీసుకొచ్చారు.ఓటుకు 6 వేల రూపాయల నుంచి 10 వేల వరకు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఈసీ దృష్టికి తీసుకొచ్చింది. ఈ మేరకు వీడియో క్లిప్పింగ్‌లను  కాంగ్రెస్ పార్టీ సీఈసీకి అందించారు.

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదులు అందాయి.ఈ పిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నాడు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకర్గం పరిధిలోని అధికారులు, కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులతో సీఈసీ సమీక్ష నిర్వహించారు.

ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు  డబ్బులు, మద్యం సరఫరా చేశారనే విషయమై కూడ సీఈసీ ఆరా తీశారు.మాజీ మంత్రి Etela Rajenderఈ ఏడాది జూన్ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సుమారు నాలుగు మాసాల నుండి ఈ స్థానంలో బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్ధులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని ప్రకటించింది.

ఈ స్థానం నుండి 2009 నుండి ఈటల రాజేందర్ Trs అభ్యర్ధిగా విజయం సాధించారు. అయితే  మంత్రివర్గం నుండి కేసీఆర్ భర్తరఫ్ చేయడంతో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి Bjpలో చేరారు. ఈ దఫా ఆయన బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా Gellu Srinivas Yadavపోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా Balmuri Venkat బరిలో నిలిచారు.

ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో బీజేపీ, టీఆర్ఎస్‌లున్నాయి. ఇందు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈటల రాజేందర్ ను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఉండేందుకు టీఆర్ఎస్ అన్ని వ్యూహాలను అమలు చేయాలని భావిస్తోంది. మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు సవాల్ విసిరేందుకు కమల దళం సమాయత్తమైంది.


 

click me!