తిరుమలలో మంత్రి హరీష్ రావుకి ఘోర పరాభవం

Published : Jan 06, 2020, 08:07 AM ISTUpdated : Jan 06, 2020, 10:33 AM IST
తిరుమలలో మంత్రి హరీష్ రావుకి ఘోర పరాభవం

సారాంశం

టీటీడీ వైఖరి పట్ల మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి వెళ్లేందుకు నిరాకరించారు. అయితే టీటీడీ పాలకమండలి సభ్యుడు దామోదర్ దౌత్యంతో హరీష్ రావు తిరిగి శ్రీవారి దర్శనానికి వెళ్లారు.  

తెలంగాణ మంత్రి హరీష్ రావుకి తిరుమల లో ఘోర పరాభవం చోటుచేసుకుంది. సోమవారం వైకుంఠ ఏకాదశి కావడంతో.... ఆయన తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు తిరుపతి వెళ్లారు. అయితే...మంత్రి హరీష్ రావుకి టీటీడీ ప్రోటోకాల్ పాటించకపోవడం గమనార్హం.

 దీంతో టీటీడీ వైఖరి పట్ల మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి వెళ్లేందుకు నిరాకరించారు. అయితే టీటీడీ పాలకమండలి సభ్యుడు దామోదర్ దౌత్యంతో హరీష్ రావు తిరిగి శ్రీవారి దర్శనానికి వెళ్లారు.

AlsoRead బాబూమోహన్ పై సంచలన వ్యాఖ్యలు: మంత్రులకు కేసీఆర్ వార్నింగ్...

ఇదిలా ఉండగా... ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని సోమవారం దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ రోజు శ్రీవెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే పుణ్యం దక్కుతుందని నమ్మకం. అందుకే అన్ని ఆలయాల్లో భక్తులు బారులు తీరి ఉన్నారు. ఇక తిరుమలలో పరిస్థితి అయితే.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆలయ అధికారులు కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది