
హెయిర్ పెరగడంతో ఓ యువతి బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. హెయిర్ కట్ చేయాలని అక్కడి బ్యూటీషియన్లను ఆమె కోరింది. దీంతో ఆ యువతి చెప్పినట్టగానే వారు చేశారు. అనంతరం ఓ ఆయిల్ ను ఆమె జుట్టుకు పెట్టారు. కొంత సమయం అవగానే ఆ జుట్టు మొత్తం ఊడిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ లోని అబిడ్స్ లో చోటు చేసుకుంది.
అబిడ్స్ లో ఉన్న ఓ బ్యూటీ పార్లర్ కు వెళ్లిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. హెయిర్ కట్ చేయాలని అక్కడి నిర్వాకులకు ఆమె సూచించింది. ఆమె చెప్పినట్టుగానే చేసిన అనంతరం జుట్టుకు వారు ఓ ఆయిల్ పెట్టారు. కొంత సమయం తరువాత ఆమె జుట్టు మొత్తం ఊడిపోయింది. దీంతో ఒక్క సారిగా ఆమె షాక్ అయ్యింది.
భర్త ద్వారా పరిచయం.. పలుమార్లు భార్యపై టీడీపీ నాయకుడి లైంగిక వేధింపులు..
అనంతరం బయటకు వచ్చి బాధితురాలి పోలీసులను ఆశ్రయించింది. తనకు ఎదురైన ఘటనను వారికి వివరించింది. బ్యూటీ పార్లర్ నిర్వాహకులపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గతంలో కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న బ్యూటీ పార్లర్ లలో ఇలాంటి ఘటనలు జరిగాయి.
నేడు జీరో షాడో డే.. హైదరాబాద్ లో ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు.. ఎక్కడంటే ?
ఈ ఏడాది మార్చిలో కర్ణాటకలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. హసన్ జిల్లాకు చెందిన ఓ యువతికి పెళ్లి నిశ్చయమైంది. మరి కొన్ని రోజుల్లో పెళ్లి ఉందనగా.. ఆమె బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. మేకప్ వేయాలని నిర్వాహకులకు సూచించింది. దీంతో ఆమె ముఖానికి నిర్వాహకులు నీటి ఆవిరి పట్టారు. కానీ ఆ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆవిరి ఎక్కువై ఆ వేడికి యువతి ముఖమంతా వాచిపోయి అందవికారంగా తయారయ్యింది. ముఖమంతా నల్లగా మారి, కళ్లు, బుగ్గలు వాచిపోయి రూపం మొత్తం మారిపోయింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. బ్యూటీపార్లర్ పై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.