నేడు జీరో షాడో డే.. హైదరాబాద్ లో ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు.. ఎక్కడంటే ?

Published : Aug 03, 2023, 08:50 AM IST
నేడు జీరో షాడో డే.. హైదరాబాద్ లో ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు.. ఎక్కడంటే ?

సారాంశం

నేడు హైదరాబాద్ లో ‘జీరో షాడో డే’ ఆవిష్కృతం కానుంది. దీనిని ఆస్వాదించేందుకు బిర్లా ప్లానిటోరియం అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. నేటి మధ్యాహ్నం 12.22 గంటలకు జీరో షాడో ఏర్పడనుంది.

ఈ ఏడాదిలో రెండో సారి నేడు (గురువారం) ‘జీరో షాడో డే’ ఆవిష్కృతం కానుంది. హైదరాబాద్ లో ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా ప్లానిటోరియం అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12.22 గంటలకు 'జీరో షాడో డే' దృగ్విషయాన్ని ఆసక్తిగా వీక్షించేలా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 

సెల్ ఫోన్ ఛార్జర్ స్విచ్చ్ ఆఫ్ చేయడం మర్చిపోయిన తండ్రి.. పిన్ను నోట్లో పెట్టుకొని 8 నెలల చిన్నారి మృతి

భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో, ముఖ్యంగా మకర రేఖ, కర్కాటక రేఖ మధ్య సంవత్సరానికి రెండుసార్లు 'జీరో షాడో డే' జరుగుతుంది. ఈ ప్రత్యేకమైన సంఘటనలో సూర్యుడు భూమధ్యరేఖకు నేరుగా ఎగువకు వస్తాడు. దీనివల్ల భూమిపై ఉన్న వస్తువులు, జీవుల నీడ ఏర్పడదు. ఈ ఏడాది మొదటి సారి మే 9న హైదరాబాద్ లో ఇది ఏర్పడింది. 

‘‘దీనిని ఆస్వాదించడానికి సూర్యుడు నేరుగా పడే బహిరంగ ప్రదేశంలో ఉండాలి. చుట్టూ ఎత్తైన భవనాలు, చెట్లు లేదా నీడలను కలిగించే ఇతర అడ్డంకులు ఉండకుండా చూసుకోవాలి. సరిగ్గా నేటి మధ్యాహ్నం 12:22 గంటలకు సూర్యుడు నేరుగా నెత్తిపైకి వచ్చిన సమయంలో బహిరంగ ప్రదేశంలో నిలబడాలి. ఆ సమయంలో నీడ అదృశ్యమవుతుంది. దీని వల్ల ‘జీరో షాడో’ ఆస్వాదించే అవకాశం మీకు లభిస్తుంది’’ అని బిర్లా ప్లానిటోరియం సీనియర్ అధికారి ఒకరు ‘ది హన్స్ ఇండియా’తో తెలిపారు. కొంత సమయం పాటు నీడ కనిపించదని ఆయన పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే