హైద్రాబాద్ పాతబస్తీలో దారుణం: బైక్ రేసింగ్ అడ్డుకున్న యువకుడిపై కత్తితో దాడి

Published : Feb 23, 2023, 09:20 AM IST
హైద్రాబాద్ పాతబస్తీలో  దారుణం: బైక్ రేసింగ్  అడ్డుకున్న యువకుడిపై కత్తితో దాడి

సారాంశం

హైద్రాబాద్ పాతబస్తీలో  బైక్ రేసర్లు  రెచ్చిపోయారు.  బైక్ రేసింగ్  వద్దని  వారించిన యువకుడిపై కత్తతితో  దాడికి దిగారు. 

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో  బైక్ రేసర్లు   గురువారంనాడు దారుణానికి  పాల్పడ్డారు.  హైద్రాబాద్  పాతబస్తీ  ఫలక్‌నుమాలో  బైక్ రేసర్లను  ఓ యువకుడు అడ్డుకున్నాడు  దీంతో  బైక్ రేసర్లు  రెచ్చిపోయారు.  బైక్ రేసింగ్  ను  అడ్డుకున్న యువకుడిపై కత్తులతో  దాడికి దిగారు. ఈ ఘటనలో  తీవ్రంగా  గాయపడిన  యువకుడిని  స్థానికులు  ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యులు  పోలీసులకు  ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు  పోలీసులు  కేసు నమోదు  చేశారు.  బైక్ రేసర్ల  కోసం  పోలీసులు గాలింపు చర్యలుచేపట్టారు.  ఘటన జరిగిన ప్రాంతంలో  సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్