భువనగిరి ప్రజాశీర్వాద సభలో అపశృతి.. కార్యకర్తకు హార్ట్ ఎటాక్.. మృతి

Google News Follow Us

సారాంశం

యాదాద్రి భువనగిరి ప్రజాశీర్వాద సభ కోసం వచ్చిన కార్యకర్త గుండె పోటుతో మరణించాడు. సభా ప్రాంగణంలో కుప్పకూలిపోయిన సత్తయ్యను వెంటనే హాస్పిటల్ తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.
 

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ రోజు జనగామాలో మాట్లాడిన తర్వాత యాదాద్రి భువనగిరిలో నిర్వహించిన సభకు హాజరయ్యారు. అయితే, సీఎం కేసీఆర్ భువనగిరికి రావడానికి ముందు ప్రజాశీర్వాద సభలో అపశృతి చోటుచేసుకుంది. ఈ సభకు వచ్చిన ఓ కార్యకర్తకు గుండెపోటు వచ్చింది. హాస్పిటల్ తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.

సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడబోతున్న యాదాద్రి భువనగిరిలోని ప్రజాశీర్వాద సభ కోసం పోచంపల్లి మండలం జూలురుకు చెందిన సత్తయ్య వచ్చాడు. సీఎం కేసీఆర్ ఆ సభకు హాజరు కావడానికి ముందు ఆట, పాటలతో భువనగిరి ప్రభుత్వ కాలేజీ ఆవరణలోని ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం మారుమోగిపోయింది. ఈ సందర్భంలోనే సత్తయ్య కుప్పకూలిపోయాడు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సత్తయ్యను పరీక్షించి అప్పటికే మరణించినట్టు ధ్రువీకరించారు.

Also Read: జనగామాలో కేసీఆర్ లౌకిక వచనాలు.. కాంగ్రెస్ ఎఫెక్టేనా?

జనగామా సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించిన తర్వాత సాయంత్రంపూట యాదాద్రి భువనగిరి ప్రజాశీర్వాద సభకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయం గురించి, పెరిగిన భూముల ధరల గురించి ప్రస్తావించారు. పూట పూటకు ధరలు పెరుగుతున్నాయని వివరించారు. యాదాద్రికి ఐటీ పరిశ్రమలను తీసుకురావాలని తాను మంత్రులకు చెప్పినట్టు తెలిపారు.