మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానాన్ని ఆమె ఆశించారు. కానీ బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కని కారణంగా ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత సోమవారంనాడు బీఆర్ఎస్ రాజీనామా చేశారు. నిజామాబాద్ అర్బన్ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్టును ఆకుల లలిత ఆశించారు. కానీ ఆలకుల లలితకు బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కలేదు. దీంతో ఆకుల లలిత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీ నుండే బీఆర్ఎస్ లో చేరారు.
2015 మే 21న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆకుల లలితను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఆకుల లలితను ఎమ్మెల్సీగా ఖరారు చేసే విషయంలో అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న డీఎస్ తో సంప్రదించలేదనే ప్రచారం కూడ సాగింది. ఈ విషయంతో పాటు మరికొన్ని కారణాలతో కాంగ్రెస్ పార్టీకి డీఎస్ గుడ్ బై చెప్పారు. డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారనే కారణంతో బీఆర్ఎస్ నుండి డి.శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటేసింది.
ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ నుండి ఆకుల లలిత బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ మహిళా ఆర్ధిక సహకారసంస్థ కు ఆకుల లలిత చైర్ పర్సన్ గా కూడ పనిచేశారు. నిజామాబాద్ అర్బన్ స్థానం నుండి బీఆర్ఎస్ టిక్కెట్టును ఆకుల లలిత ఆశించారు. కానీ బీఆర్ఎస్ టిక్కెట్టు మాత్రం ఆమెకు దక్కలేదు. దీంతో ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. నిజామాబాద్ అర్బన్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆకుల లలిత పోటీ చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించే రెండో జాబితాలో ఆమెకు చోటు దక్కుతుందా లేదా అనే విషయం మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది.