2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు :కోమటిరెడ్డి సంచలనం

By narsimha lode  |  First Published Feb 14, 2023, 11:45 AM IST

తెలంగాణ రాష్ట్రంలో  వచ్చే ఎన్నికల తర్వాత  బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు  కుదిరే అవకాశం ఉందని  కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.  


న్యూఢిల్లీ:    తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి  2023లో  జరిగే  ఎన్నికల్లో  హంగ్ అసెంబ్లీ వస్తుందని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.మంగళవారం నాడు కేంద్ర  ఉపరితల రవాణాశాఖ మంత్రి  నితిన్ గడ్కరీని  భువనగిరి  ఎంపీ  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి న్యూఢిల్లీలో కలిశారు.  జాతీయ రహదారులతో  పాటు   రీజినల్ రింగ్  రోడ్లకు  సంబంధించిన  అంశంపై   కేంద్ర మంత్రికి  ఆయన వినతి పత్రం సమర్పించారు.  

ఈ సందర్భంగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు.   వచ్చే ఎన్నికల్లో  ఏ పార్టీకి కూడా స్వంతంగా  60 సీట్లు దక్కవన్నారు. తన  రాజకీయ అనుభవంతో  ఈ విషయం చెబుతున్నట్టుగా  చెప్పారు.  హంగ్ అసెంబ్లీ ఏర్పడితే  కాంగ్రెస్ పార్టీతో  కేసీఆర్  పొత్తు పెట్టుకుంటుాడని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు సెక్యులర్ పార్టీలన్నారు. అందుకే ఈ రెండు పార్టీలు కలుస్తాయని ఆయన  జోస్యం చెప్పారు.   ఎన్నికలకు ఎంతో సమయం లేదన్నారు.  ఎన్నికలకు  కనీసం  ఏడాది ముందే  కనీసం  60 అభ్యర్ధులను ప్రకటించాలని తాము రాహుల్ గాంధీని  కోరిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  గుర్తు చేశారు. 

Latest Videos

undefined

కొత్తైనా, పాతైనా  గెలిచే అభ్యర్ధులకే టికెట్లు  ఇవ్వాలని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో  ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు.  ఎన్నికల తర్వాత  పొత్తులుంటాయని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రకటించారు. ఈ ఏడాది మార్చి  1 నుండి  పాదయాత్ర, బైక్ యాత్ర  చేస్తానని వెంకట్ రెడ్డి  చెప్పారు.  

 అసెంబ్లీ ఎన్నికలకు కనీసం ఏడాది ముందుగానే  అభ్యర్ధులను  ప్రకటించాలని  రాహుల్ గాంధీని కోరినట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.  గతంలో  వరంగల్ పర్యటనకు  రాహుల్ గాంధీ వచ్చిన సమయంలో  ఈ విషయమై  ఆయనతో  చర్చించినట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు..  తమ పార్టీ నేతలంతా  కష్టపడి  పనిచేస్తే  40 సీట్లు వస్తాయని  ఆయన  అభిప్రాయపడ్డారు.   ఒక్కరే పార్టీని గెలిపిస్తా అంటే  అది జరిగే  పని కాదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.  రేపు మాణిక్ రావు ఠాక్రేను కలిసి అన్ని విషయాలను  చర్చించనున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.  

also read:త్వరలో నా పాదయాత్ర షెడ్యూల్ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ పొగడాల్సిన అవసరం లేదన్నారు.  కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయన్నారు.    కాంగ్రెస్  పార్టీకి  చెందిన  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను  కేసీఆర్  ఎందుకు  తమ పార్టీలో చేర్చుకున్నారని ఆయన  ప్రశ్నించారు. రాజకీయ  వ్యూహంలో భాగంగానే  కేసీఆర్   కాంగ్రెస్ ను పొగిడారన్నారు.  అసెంబ్లీలో  ఈటల రాజేందర్ ను గురించి  కేసీఆర్ ఎందుకు  మాట్లాడారని  ఆయన అడిగారు.  వ్యూహంలో భాగంగానే కేసీఆర్ ఈటలపై ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్నారు. 

click me!