కారణమిదీ:వికారాబాద్‌లో పుట్టిన రోజుకు బంధువులను పిలిచి దాడి

Published : Feb 14, 2023, 10:44 AM IST
  కారణమిదీ:వికారాబాద్‌లో పుట్టిన రోజుకు బంధువులను పిలిచి  దాడి

సారాంశం

కొడుకు  పుట్టిన రోజున బంధువులను  పిలిచి  దాడికి దిగాడు  నవీన్ అనే వ్యక్తి. ఈ ఘటన వికారాబాద్  జిల్లాలో  జరిగింది.  

హైదరాబాద్: కొడుకు  పుట్టిన రోజుకు  బందువులను పిలిచి  దాడికి దిగాడు  నవీన్ అనే వ్యక్తి. మద్యం మత్తులో  నవీన్ ఈ దాడికి పాల్పడ్డాడు.  ఈ విషయమై  బంధువులు పోలీసులకు  ఫిర్యాదు  చేశారు. పోలీసులు నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన  వికారాబాద్  జిల్లాలో సోమవారంనాడు రాత్రి జరిగింది. 

వికారాబాద్ జిల్లాలోని  అత్తిలి గ్రామానికి  చెందిన నవీన్  తన కొడుకు పుట్టిన రోజును పురస్కరించుకొని  బంధువులకు  పిలిచాడు.   బర్త్ డే వేడుకల సందర్భంగా  బంధువులకు  పార్టీ ఏర్పాటు  చేశాడు. అయితే  ఈ సమయంలో  నవీన్ కూడా  మద్యం సేవించాడు.  ఈ సమయంలో  కారు ఇవ్వాలని  నవీన్  బంధువును  కోరాడు.  మద్యం మత్తులో  ఉన్నందున  కారు ఇచ్చేందుకు  బంధువు  నిరాకరించాడు.  దీంతో  నవీన్  ఆగ్రహం పట్టలేకపోయాడు. పుట్టిన రోజు ఫంక్షన్ కు వచ్చిన బంధువులను  గదిలో బంధించి  చితకబాదాడు.  ఈ ఘటనతో  బంధువులు  షాక్ కు గురయ్యారు. వెంటనే వారంతా  పోలీసులకు  ఫిర్యాదు చేశారు.  గదిలో  బంధించిన  బంధువులను పోలీసులు విడిపించారు.   నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల నమోదు ఎలా చేసుకోవాలి? అర్హతలు ఏంటి?
Weather Update: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలు