ఆరడుగుల హైట్ ఉంటే సరిపోదు... ఏం జరుగుతుందో తెలుసుకోవాలి: మంత్రి హరీష్ కు కోమటిరెడ్డి కౌంటర్

By narsimha lode  |  First Published Sep 29, 2023, 2:44 PM IST

ఉచిత విద్యుత్ పై  మంత్రి హరీష్ రావుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  సవాల్ విసిరారు.  కాంగ్రెస్ పై చేసిన విమర్శలకు ఆయన  కౌంటర్ ఇచ్చారు.


హైదరాబాద్: రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు నిరూపిస్తే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి హరీష్ రావుకు  సవాల్ విసిరారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పై మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. ఈ విమర్శలకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటరిచ్చారు.  శుక్రవారం నాడు హైద్రాబాద్ లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 24 గంటల ఉచిత విద్యుత్ ను వ్యవసాయానికి ఎక్కడ ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ లు ప్రాతినిథ్యం వహిస్తున్న గ్రామాల్లోకి వెళ్లి ఈ విషయమై విచారణ చేయాలని ఆయన కోరారు. 

ఆరు అడుడుల హైట్ ఉండగానే సరిపోదు.... మీ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని హరీష్ రావుకు  కోమటిరెడ్డి హితవు పలికారు.  మా పార్టీలో ఏం జరుగుతుందో మీకెందుకని ఆయన అడిగారు.  డబ్బులు తీసుకొని టిక్కెట్లు ఇచ్చే చరిత్ర తమ పార్టీలో లేదన్నారు. దళితబంధు, బీసీ బంధులో మీ పార్టీ నేతలు కమీషన్లు తీసుకొంటున్నారని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఆరోపించారు. 

Latest Videos

undefined

కేసీఆర్ పాలనను రజాకార్ల పాలనగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభివర్ణించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు హామీలను అమలు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో 80 నుండి 85 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలపై అధిష్టానం వద్ద చర్చిస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.ఈ విషయాలపై తాను మీడియాతో మాట్లాడబోనన్నారు.  టీఆర్ఎస్ పేరును మార్చుకున్నప్పుడే ఆ పార్టీ కథ ముగిసిందన్నారు. తెలంగాణ కోసం ఏర్పడిన పార్టీ తెలంగాణ పేరు మార్చుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు.

also read:సమయం లేదు: చంద్రబాబు అరెస్ట్‌పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

పరీక్షల నిర్వహణలో  టీ‌ఎస్‌పీఎస్‌సీ వైఫల్యం చెందిందన్నారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల గురించి తన వెంటే చూపిస్తానని  మంత్రులకు చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 

 

click me!