భువనగిరి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

By Siva Kodati  |  First Published Mar 13, 2024, 9:01 PM IST

2008లో ఏర్పడిన భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడ 2009, 2019లలో ఆ పార్టీయే విజయం సాధించగా.. 2014లో బీఆర్ఎస్ గెలిచింది. ఎన్నో ఉద్యమాలకు, ఘన చరిత్రకు చిహ్నం భువనగిరి . ఎంతోమంది కళాకారులు, ఉద్యమకారులను అందించింది భువనగిరి. రజాకార్లకు ఎదురు తిరిగిన బైరాన్ పల్లి బురుజు కూడా ఈ పార్లమెంట్ స్థానంలోనే వుంది. కోమటిరెడ్డి కుటుంబం మరోసారి భువనగిరి బరిలో నిలవాలని భావిస్తోంది. ఆర్ధికంగా, సామాజికంగా బలమైన ఈ కుటంబానికి టికెట్ ఇస్తే మరోసారి విజయం ఖాయమనే భావన అందరిలో వుంది. ఇక్కడ బీసీ నేతను బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, క్యామ మల్లేశ్ పేర్లను పరిశీలిస్తున్నారు. 


ఎన్నో ఉద్యమాలకు, ఘన చరిత్రకు చిహ్నం భువనగిరి . ఎంతోమంది కళాకారులు, ఉద్యమకారులను అందించింది భువనగిరి. భాగ్యనగరానికి కూతవేటు దూరంలో వరంగల్ జాతీయ రహదారి ప్రక్కనే వుంది. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమం ఇక్కడ బలంగా నడిచింది. రజాకార్లకు ఎదురు తిరిగిన బైరాన్ పల్లి బురుజు కూడా ఈ పార్లమెంట్ స్థానంలోనే వుంది. 1948 ఆగస్ట్ 27న బైరాన్‌పల్లి నరమేధం జరిగింది. ఈ సాయుధ పోరులో 118 మంది వీరమరణం పొందారు. ఒగ్గుకథ సృష్టికర్త చుక్క సత్తయ్య కూడా భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్‌కు చెందినవారే. పెంబర్తి లోహ హస్తకళలకు, వరి, పత్తి, చెరకు, మొక్కజోన్న, పెసర, శెనగ వంటి పంటలకు భువనగిరి కేంద్రం. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కూడా ఈ పార్లమెంట్ పరిధిలోకే వస్తుంది. 

భువనగిరి ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. ఉద్యమాల ఖిల్లా : 

Latest Videos

2008లో ఏర్పడిన భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడ 2009, 2019లలో ఆ పార్టీయే విజయం సాధించగా.. 2014లో బీఆర్ఎస్ గెలిచింది. ఈ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగామ అసెంబ్లీ స్థానాలున్నాయి. భువనగిరి లోక్‌సభ స్థానంలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,28,033 మంది. వీరిలో పురుషులు 8,08,939 కాగా.. మహిళలు 8,19,064. 

2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ 12,12,631 మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. 74.48 శాతం పోలింగ్ నమోదైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ 6 చోట్ల, బీఆర్ఎస్ ఒక చోట విజయం సాధించాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి 5,32,795 ఓట్లు.. బీఆర్ఎస్ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్‌కు 5,27,576 ఓట్లు , బీజేపీ అభ్యర్ధి పడాల వెంకట శ్యామ్ సుందర్ రావుకు 65,451 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా కాంగ్రెస్ ఇక్కడ 5,119 ఓట్ల మెజారిటీతో భువనగిరిని కైవసం చేసుకుంది.

భువనగిరి ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. కోమటిరెడ్డి ఫ్యామిలీ కన్ను : 

తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే కోమటిరెడ్డి కుటుంబం మరోసారి భువనగిరి బరిలో నిలవాలని భావిస్తోంది. ఆర్ధికంగా, సామాజికంగా బలమైన ఈ కుటంబానికి టికెట్ ఇస్తే మరోసారి విజయం ఖాయమనే భావన అందరిలో వుంది.

వెంకట్ రెడ్డి కుమార్తె శ్రీనిధి రెడ్డి లేదా ఆయన మరో సోదరుడు మోహన్ రెడ్డి తనయుడు సూర్య పవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీలతో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే శాసనమండలి ఛైర్మన్, బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది.  భువనగిరి పార్లమెంట్ టికెట్‌పై హామీ లభిస్తే ఆయన పార్టీ మారుతారనే చర్చ మొదలైంది. 

బీఆర్ఎస్ విషయానికి వస్తే.. గతంలో ఎంపీగా పనిచేసిన బూర నర్సయ్య గౌడ్ బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. ఇదే వ్యూహంతో ఇక్కడ బీసీ నేతను బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, క్యామ మల్లేశ్ పేర్లను పరిశీలిస్తున్నారు. భువనగిరి లోక్‌సభ సెగ్మెంట్‌లోని భువనగిరి, మునుగోడు, జనగామ, ఆలేరు, ఇబ్రహీంపట్నంలలో బీసీ వర్గాలైన కురుమ, గౌడ, పద్మశాలి వర్గాలు బలంగా వున్నాయి. అందుకే బీసీ నేతనే బరిలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీ ఇప్పటికే మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌కు టికెట్ ఖరారు చేయడంతో ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు. 
 

click me!