బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణలో ఆరు స్థానాల్లో అభ్యర్థులు వీరే

Published : Mar 13, 2024, 07:41 PM IST
బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణలో ఆరు స్థానాల్లో అభ్యర్థులు వీరే

సారాంశం

బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.  

లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ.. అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో పలు రాష్ట్రాల్లోని 72 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది.

ఎస్టీ రిజర్వ్డ్ ఆదిలాబాద్ లోక్ సభ స్థానానికి గోడం నగేష్‌, ఎస్సీ రిజర్వ్డ్ పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మెదక్ నుంచి మాదవనేని రఘునందన్ రావు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, నల్గొండ నుంచి సైదా రెడ్డి, మహబూబాబాద్ నుంచి అజ్మీరా సీతారాం నాయక్‌లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది.

సీతారాం నాయక్ ఆదివారం జలగం వెంకట్రావుతో కలిసి ఢిల్లీలో బీజేపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అంతకు ముందే కిషన్ రెడ్డి సీతారాం నాయక్‌ను హనుమకొండలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఆ తర్వాత పార్టీ మారడంపై నిర్ణయం తీసుకుంటానని సీతారాం నాయక్ అన్నారు. పార్టీ మారారో లేదో.. ఆయనకు మహబూబాబాద్ నుంచి టికెట్ లభించింది.

PREV
click me!

Recommended Stories

Cold Free Winter: ఈసారి చలి లేనట్టే.. శీతాకాలంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఎందుకిలా?
PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఖాతాలోకి ఎప్పుడంటే?