
హైదరాబాద్: ఉమ్మడి Adilabad జిల్లాలోని Chennuru అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే Nallala Odelu టీఆర్ఎస్ ను వీడి Congress లో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత Rahul Gandhi సమక్షంలో ఓదేలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకొనే అవకాశం ఉంది. టీపీసీసీ చీఫ్ Revanth Reddy, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలతో కలిసి ఓదేలు ఢిల్లీకి వెళ్లినట్టుగా సమాచారం. ఓదేలుతో పాటు ఆయన భార్య మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మెన్ భాగ్యలక్ష్మి కూడా ఉన్నారని సమాచారం.
2009, 2010లో జరిగిన ఉప ఎన్నిక, 2014లో జరిగిన ఎన్నికల్లో చెన్నూరు నుండి టీఆర్ఎస్ అభర్ధిగా నల్లాల ఓదేలు విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఈ స్థానం నుండి బాల్క సుమన్ కి టీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. దీంతో ఓదేలు ఎమ్మెల్యే పదవికి దూరం కావాల్సి వచ్చింది. ఓదేలు భార్యను మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మెన్ గా టీఆర్ఎస్ నియమించింది. అయితే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బాల్క సుమన్, నల్లాల ఓదేలు మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి.దీంతో ఓదేలు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొన్నట్టుగా చెబుతున్నారు. ఈ నిర్ణయంలో భాగంగానే ఓదేలు ఇవాళ ఢిల్లీకి వెళ్లినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.