ఖమ్మంలో భట్టి పాదయాత్ర ముగింపు సభకి భారీ ఏర్పాట్లు.. 100 ఎకరాల్లో బహిరంగ సభ..

Published : Jun 29, 2023, 10:44 PM ISTUpdated : Jun 30, 2023, 06:03 AM IST
ఖమ్మంలో భట్టి పాదయాత్ర ముగింపు సభకి భారీ ఏర్పాట్లు.. 100 ఎకరాల్లో బహిరంగ సభ..

సారాంశం

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన  పాదయాత్ర ఖమ్మంలో ముగుస్తుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించి, ముఖ్యఅతిథులుగా రాహుల్, ప్రియాంకగాంధీలను ఆహ్వానించాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది.  

తెలంగాణలో రోజురోజుకు రాజకీయాలు వేడ్కెకుతున్నాయి.  రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలని అధికార , ప్రతిపక్ష పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఇక కర్నాటక ఫలితాలతో జోష్‌ మీదున్న తెలంగాణ కాంగ్రెస్‌కు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రతో పార్టీకి మరింత ఊపొచ్చింది. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం భట్టి పాదయాత్రకకు ఫిదాయ్యారు. రాహుల్  ప్రత్యేకంగా భట్టికి ఫోన్ చేసి.. ప్రశంసించారు. ఖమ్మం వేదికగా జరుగనున్న పాదయాత్ర ముగింపు సభలోభట్టి విక్రమార్కను స్వయంగా రాహుల్ గాంధీ ఘనంగా సన్మానం చేస్తారని పార్టీ సీనియర్ నేతలు  వెల్లడించారు.
 

గత మూడు నాలుగు నెలల నుంచి మండుటెండల్లో భట్టి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి క్రేజ్ రావడంతో జూలై 2వ తేదీన ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి, ముఖ్యఅతిథులుగా రాహుల్, ప్రియాంకగాంధీలను ఆహ్వానించాలని భావిస్తోంది. ఈ మేరకు ఇక ఖమ్మం SR గార్డెన్‌ పక్కన దాదాపు వంద ఎకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 4 లక్షల మంది జన సమీకరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ  లక్ష్యంగా పెట్టుకుంది. అదే రోజు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో చేరేందుకు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే ప్రకటన చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?