డికె భరత్ సింహారెడ్డికి శనివారం ఆపరేషన్

First Published Jun 8, 2017, 4:00 PM IST
Highlights

నిన్న  రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైనా గద్వాల మాజీ ఎమ్మెల్యే డికె భరతసింహరెడ్డి  కోలుకుంటున్నారు. అయితే ఎడమ చేయికి శస్త్రచికిత్స చేయాల్సి అవసరం ఉందని అపోలో డాక్టర్లు చెప్పారు. సాధారణ కట్టుతో ఎడుమ చేయి ఎముక అతుక్కునే పరిస్థితి లేకపోవడంతో శస్త్రచికిత్స తప్పనిసరి అవుతున్నది. శనివారం అపరేషన్ చేస్తారు.

నిన్న రో డ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైనా గద్వాల మాజీ ఎమ్మెల్యే డికె భరతసింహరెడ్డి  కోలుకుంటున్నారు. అయితే ఎడమ చేయికి శస్త్రచికిత్స చేయాల్సి అవసరం ఉందని అపోలో డాక్టర్లు చెప్పారు. 

 సాధారణ కట్టుతో ఎడుమ చేయి ఎముక అత్త్కుకొనే పరిస్థితి లేకపోవడంతో శస్త్రచికిత్స తప్పనిసరి అయింది. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భరతసింహరెడ్డిని ఆర్థోపెడిక్, న్యూరో ఫిజిషియన్, హుద్రోగ నిపుణులు పరిక్షించారు.  సిటి స్కాన్, ఎంఆర్ఐ తో పాటు పలు వైద్య పరిక్చలు నిర్వహించారు. వీటంన్నిటి ఫలితాలు రావాడానికీ రెండు రోజుల సమయం పట్టనున్నడంతో శస్త్రచికిత్సను శనివారం నిర్వహించాలని వైద్యుల బృందం నిర్ణయించిది.

భరతసింహరెడ్డి ఆరోగ్యం కుదుట పడుతున్నదని , చికిత్సకు ఆయన బాగా స్పందిస్తున్నారని ఆయన భార్య, గద్వాల ఎమ్మెల్యే  డికె అరుణ తెలిపారు. ప్రత్యేక గదిలో చికిత్స కొనసాగుతున్నదని దీనితో వైద్యులు ఎవరని లోనికి అనుమతించడం లేదన్నారు. కార్యకర్తలు, అభిమానాలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఓ రెండు రోజులు సహకరించాలని ఆమే విజ్ఞప్తి చేశారు. 


కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఆసుపత్రికి చెరుకొని భరతసింహరెడ్డిని పరమార్శించారు. కాంగ్రెస్ నేతలు  మల్లురవి, కూచుకుళ్ళ దామోదర రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీ చంధర్ రెడ్డి,  పార్లమెంట్ సభ్యులు నంది ఎల్లయ్య, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హర్షవర్ధన్ రెడ్డి  ఆయనను పరామర్శించారు.

 

click me!