హైకోర్టు ఆదేశాలు బేఖాతరు.. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తాం: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి సంచలనం

By Siva KodatiFirst Published Sep 14, 2021, 9:25 PM IST
Highlights

హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనానికి సంబంధించి గందరగోళనం నెలకొన్న నేపథ్యంలో భాగ్య నగర్ గణేశ్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి తేల్చిచెప్పింది. 

హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనానికి సంబంధించి గందరగోళనం నెలకొన్న నేపథ్యంలో భాగ్య నగర్ గణేశ్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి తేల్చిచెప్పింది. కోర్టు తీర్పులకు కాదని జల్లికట్టు లాంటి పండుగలను నిర్వహిస్తున్నారని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు గుర్తు చేశారు. శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలోనే హైదరాబాద్ గణేష్ శోభాయాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ వేడుకల్లో లక్షలాది మంది పాల్గొంటారని భగవంతరావు వివరించారు.

Also Read:హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనం: సుప్రీంలో తెలంగాణ సర్కార్ పిటిషన్

రసాయనాలను రోజు వెదజల్లే కంపెనీలను ఆపలేని కోర్టులు & ప్రభుత్వాలు ఒక్క రోజు నిమజ్జనం ఆపటానికి అడ్డంకి ఎందుకో? అని ఆయన ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకపోతే వేరే చెరువుల్లో చేయవచ్చు అని కోర్ట్ సమాధానం ఐతే మరి ఆ చెరువులు కూడా కలుషితం అవుతాయి అని తెలియదా? ఇంత వరకు రసాయనాలు రోజు వెదజల్లే కంపెనీలకు నోటీసులు కూడా ఇవ్వని కోర్ట్ తీర్పులు , ప్రభుత్వ ఆర్డర్లు ఎక్కడ ? అని భగవంతరావు ప్రశ్నించారు. వచ్చే ఏడాది నుంచి మట్టి గణపతినే పెట్టాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఉన్నచోటునే మండపంలోనే నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. 

click me!