తుపాకీ రాముడి మాటలు పట్టించుకోను: కేటీఆర్ రాజీనామా సవాల్‌పై బండి సంజయ్ కౌంటర్

Siva Kodati |  
Published : Sep 14, 2021, 06:31 PM ISTUpdated : Sep 14, 2021, 06:32 PM IST
తుపాకీ రాముడి మాటలు పట్టించుకోను: కేటీఆర్ రాజీనామా సవాల్‌పై బండి సంజయ్ కౌంటర్

సారాంశం

మంత్రి కేటీఆర్ సవాల్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటరిచ్చారు. కేటీఆర్‌కు రాజ్యాంగం తెలియదని, తుపాకీ రాముడి మాటలను తాను పట్టించుకోనని.. రైతులు, విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటునందుకు కేటీఆరే రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

మంత్రి కేటీఆర్ సవాల్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటరిచ్చారు. కేటీఆర్ కాదు.. కేసీఆర్ చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కేటీఆర్ అజ్ఞాని అని, తుపాకీ రాముడని సంజయ్ వ్యాఖ్యానించారు. యూపీఏ కంటే ఎన్డీయేనే 9 శాతం నిధులు అధికంగా ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ వస్తే మోడీ దగ్గరికి వెళ్లి ఇద్దరం రాజీనామా చేద్దామని సంజయ్ అన్నారు. పన్నుల విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి చట్టం వుంటుందని ఆయన తెలిపారు.

కేంద్రమంత్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగిడినట్లు లీకులు ఇస్తున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు రాజ్యాంగం తెలియదని ఆయన విమర్శించారు. తుపాకీ రాముడి మాటలను తాను పట్టించుకోనని.. రైతులు, విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటునందుకు కేటీఆరే రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఒక్కో తెలంగాణ పౌరుడిపైనా రూ.లక్ష అప్పు చేసినందుకు కేటీఆరే రాజీనామా చేయాలని ఆయన కోరారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసినందుకు కేటీఆరే రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

అంతకుముందు తెలంగాణకు కేంద్రం ఇచ్చిన దానిపై బండి సంజయ్ చర్చకు రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తాను చెప్పినవని తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ... మీరు చెప్పినవి తప్పయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఆరున్నరేళ్లలో కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు కట్టామని.. కేంద్రం నుంచి ఫైనాన్స కమిషన రూపంలో రూ.1.42 లక్షల కోట్లు ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. ఎవరి పైసలతో మీరు కులుకుతున్నారో మీరే చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని.. సొల్లు కబులర్లు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు మోడీ సర్కార్ అన్యాయం చేస్తోందని మంత్రి ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం