KTR: తెలంగాణ ప్రగతిలో భాగస్వాములు అవ్వండి.. ఐటీ స‌ర్వ్ అల‌య‌న్స్‌లో మంత్రి కేటీఆర్‌

Published : Mar 23, 2022, 10:40 PM ISTUpdated : Mar 23, 2022, 11:39 PM IST
KTR:  తెలంగాణ ప్రగతిలో భాగస్వాములు అవ్వండి.. ఐటీ స‌ర్వ్ అల‌య‌న్స్‌లో మంత్రి కేటీఆర్‌

సారాంశం

KTR: అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి  కేటీఆర్ బుధ‌వారం శాన్‌జోస్‌లో జరిగిన‌ ఐటీ సర్వ్ అలయన్స్‌తో  సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఐటీ సర్వ్ అలయన్స్‌కు చెందిన 250 మందికి పైగా సభ్యులతో "తెలంగాణలో ఐటీ పెట్టుబడులు" అనే అంశంపై ప్రసంగించారు.  

KTR: తెలంగాణ రాష్ట్రానికి భారీ మొత్తంలో పెట్టుబడులు తీసుక‌రావాల‌నే  ధ్యేయంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి  కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. రెండు వారాల అమెరికా పర్య‌ట‌న‌లో భాగంగా ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులను కేటీఆర్ బృందం కలిసింది. పర్యటనలో భాగంగా బుధ‌వారం శాన్‌జోస్‌లో జరిగిన‌ ఐటీ సర్వ్ అలయన్స్‌తో  సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఐటీ సర్వ్ అలయన్స్‌కు చెందిన 250 మందికి పైగా సభ్యులతో "తెలంగాణలో ఐటీ పెట్టుబడులు" అనే అంశంపై ప్రసంగించారు.

ITServe అలయన్స్ అనేది IT స్టాఫింగ్ & సర్వీసెస్ సెక్టార్‌లో గ‌ల‌ లాభాపేక్ష లేని సంస్థల స‌మూదాయం ఇందులో 1400పైగా కంపెనీలున్నాయి.  ఇది USA లోని 22 రాష్ట్రాలలో 19 చాప్ట‌ర్స్‌ని కలిగి ఉంది. సభ్య కంపెనీల మొత్తం ఆదాయం $10 బిలియన్ ఉంటుంది. అలాగే ఈ కంపెనీలు 100,000 నైపుణ్యం కలిగిన IT నిపుణులకు ఉపాధి కల్పించాయి.

గత ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రస్థానాన్ని మంత్రి కేటీఆర్ సమగ్రంగా వివరించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్‌గా తెలంగాణ నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ లోటు, నీటికొరత వంటి స‌మ‌స్య‌ల‌ను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. 


హైదరాబాద్ నగరంపై భారాన్ని తగ్గించేందుకు గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీని తీసుకొచ్చామని, టైర్ 2 నగరాల్లో ఐటీని ప్రోత్సహిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ప్లగ్ & ప్లే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడం వంటి టైర్ 2 నగరాల్లో ఐటీని ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. త్వ‌ర‌లో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్‌లలో ఐటీ టవర్లు రానున్నాయని మంత్రి తెలిపారు. 

ప్లగ్ & ప్లే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడం వంటి టైర్ 2 నగరాల్లో ఐటీని ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. తెలంగాణలోని టైర్ 2 నగరాల్లో పెట్టుబడి అవకాశాలను అన్వేషించాలని ఐటీ సర్వ్ అలయన్స్ సభ్యులను మంత్రి కేటీఆర్ కోరారు. కాబోయే పెట్టుబడిదారులకు అన్ని సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

పర్యావరణ హితంగా తెలంగాణ లో అభివృద్థి జరుగుతోందన్న  కేటీఆర్,  రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్ లో 15 శాతం వాటా పునరుత్పాదక వనరులదే అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 40 మెగావాట్లగా ఉన్న స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యం ఇవాళ 5000 మెగావాట్లకు చేరిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ను ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు కేటీఆర్. ఇక పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ ను అందిస్తున్న కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు.
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: ఇరాన్‌లో యుద్ధం... హైద‌రాబాద్‌లో పూరీ, దోసెలు బంద్ చేస్తున్న హోట‌ళ్లు. అస‌లేంటీ లాజిక్
Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu