బీజేపీపై ముప్పేట దాడికి వ్యూహం: రేపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై నిరసన.. టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపు

Siva Kodati |  
Published : Mar 23, 2022, 09:49 PM ISTUpdated : Mar 23, 2022, 09:50 PM IST
బీజేపీపై ముప్పేట దాడికి వ్యూహం: రేపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై నిరసన.. టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపు

సారాంశం

గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు వ్యతిరేకంగా రేపు నిరసనలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ పిలునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రదర్శనలు చేపట్టాలని సూచించారు.

రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలకు దిగనుంది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు.. ధాన్యం కొనుగోలుకు (paddy procurement) సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి (pm narendra modi) సీఎం కేసీఆర్ (kcr)) లేఖ రాశారు. తెలంగాణలో పండిన వరిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. 

కొనకపోతే వరికి కనీస మద్ధతు ధరకు అర్ధం లేదని కేసీఆర్ అన్నారు. వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార భద్రత లక్ష్యానికి కూడా తూట్లు పొడిచినట్లేనని కేసీఆర్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటల కోసం రైతులను ప్రోత్సహించామని.. పత్తి, పామాయిల్, రెడ్‌గ్రామ్ వేయాలని కోరామని సీఎం వెల్లడించారు. రబీ సీజన్‌లో 52 లక్షల ఎకరాల్లో వరిసాగు పెట్టించామని ముఖ్యమంత్రి చెప్పారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా తెలంగాణ నుంచి వరిని కొనుగోలు చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 

అంతకుముందు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం పచ్చి అబద్దాలు చెబుతుందని టీఆర్‌ఎస్ ఎంపీలు ఆరోపించారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంప‌లేద‌ని కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడు (Bishweswar Tudu) అబద్దాలు ఆడి.. పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని అన్నారు. ఈ క్రమంలోనే బుధవారం కేంద్ర మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడుపై  టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌స‌భ‌లో  ప్రివిలేజ్ నోటీసు (privilege motion) ఇచ్చారు. కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంట్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన బిశ్వేశ్వ‌ర్‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌న్నారు.

అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్టాడారు. ఎస్టీ రిజర్వేషన్ పెంపుపై 2017లోనే  తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం జరిగిందన్నారు. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెంటనే కేంద్ర హోం శాఖకు పంపడం జరిగిందని తెలిపారు. తాము కేంద్రానికి పంపింది ప్రతిపాదన కాదని.. అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లు అని చెప్పారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరినట్టుగా తెలిపారు. ఎస్టీల రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. 

ఐదేళ్లుగా ఆ బిల్లు గురించి పార్లమెంట్‌లో ప్రస్తావిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారని చెప్పారు. ఎన్నిసార్లు అడిగినా ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు.  తెలంగాణ నుంచి ప్రతిపాదన రాలేదని కేంద్రం ఇప్పుడు కేంద్రం చెప్పడం దారుణమన్నారు. కేంద్రంలోని బీజేపీకి తెలంగాణపై చాలా అక్కసు ఉందని టీఆర్ఎస్ ఎంపీలు అన్నారు.  ఎస్టీ రిజర్వేషన్‌లు సాధించే వరకు పోరాడతామని చెప్పారు.కేంద్ర మంత్రి ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెప్పారని అన్నారు. కేంద్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజనుల రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?
డియర్ పేరెంట్స్.. 'సామాన్లు' కామెంట్స్ కాదు సమస్య.. మీ పిల్లలకు అసలు సమస్య ఇదే..!