తెలంగాణ: మూడు కార్పోరేషన్‌లకు ఛైర్మన్‌లను నియమించిన కేసీఆర్.. ఆశావహుల్లో కొత్త ఆశలు

Siva Kodati |  
Published : Mar 23, 2022, 10:12 PM ISTUpdated : Mar 23, 2022, 10:19 PM IST
తెలంగాణ: మూడు కార్పోరేషన్‌లకు ఛైర్మన్‌లను నియమించిన కేసీఆర్.. ఆశావహుల్లో కొత్త ఆశలు

సారాంశం

తెలంగాణలో మూడు కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఛైర్మన్లను నియమించారు. వీటిలో తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ,   తెలంగాణ రోడ్స్ డెవలప్‌మెంట్స్ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్‌లు వున్నాయి.

తెలంగాణలో మరో మూడు కార్పొరేషన్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఛైర్మన్లను నియమించారు. తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రావుల శ్రీధర్ రెడ్డి, తెలంగాణ రోడ్స్ డెవలప్‌మెంట్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌‌గా మెట్టు శ్రీనివాస్, మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఇంతియాజ్ ఇషాను కేసీఆర్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. కె చంద్రశేఖర్‌రావు (K Chandrashekar Rao) .. విపక్ష బీజేపీపై పోరాటాన్ని ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా టీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలు బీజేపీ వైపు చూడకుండా కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. 2023 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ నేతలు.. బీజేపీ వైపు చూడకుండా ఉండేలా ఇప్పటినుంచే జాగ్రత్త పడాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంలో ఖాళీగా nominated posts ఎక్కువగా టీఆర్‌ఎస్ నేతలకు అవకాశం కల్పించాలని చూస్తున్నారు. అంతేకాకుండా పార్టీ పదవులను భర్తీ చేయాలని చూస్తున్నారు. 

ఇటీవల ముఖ్యమంత్రి నామినేటెడ్ పదవుల భర్తీని ప్రారంభించారు. మన్నె క్రిషాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వీడా సాయిచంద్‌లకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించారు. అయితే ప్రస్తుతం పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇలా చేయడం పార్టీ నేతల్లో అసంతృప్తిని తగ్గించొచ్చని ఆయన భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. చాలా కాలంగా టీఆర్‌ఎస్ కోసం కష్టపడుతున్నవారికి, ఇతర పార్టీల నుంచి చెందిన కొందరు కీలక నేతలకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకోనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీఆర్‌ఎస్  వర్గాలు నుంచి అందుతున్న సమాచారం. 

అయితే తెలంగాణలో మంత్రి విస్తరణ కూడా జరిగే చాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా ఈ విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఎమ్మెల్సీలుగా ఎన్నికైనా ఒక్కరిద్దరికి మంత్రి వర్గం అవకాశం కల్పించనున్నారనే ప్రచారం కూడా జరిగింది. గతేడాది మే నెలలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఉద్వాసనతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం ఆ శాఖ బాధ్యతలను మంత్రి హరీష్ చేపట్టారు. అయితే ముఖ్యమంత్రి ఆ బాధ్యతలను హరీష్ వద్దే ఉంచుతురా..?, లేక ఆ స్థానంలో కొత్తవారికి ఎవరికైనా కేటాయిస్తారా..?, పూర్తిగా కేబినెట్ పునర్వ్యస్థీకరణ చేపడతారా..? అనేదానిపై మాత్రం స్పష్టత లేదు. 

PREV
click me!

Recommended Stories

డియర్ పేరెంట్స్.. 'సామాన్లు' కామెంట్స్ కాదు సమస్య.. మీ పిల్లలకు అసలు సమస్య ఇదే..!
IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త