
తెలంగాణకు అరుదైన గౌరవం దక్కింది. కానీ, ఆ గౌరవం దేనికి ఇవ్వాలో తెలియడం లేదు. ఇంతకీ విషయం ఏంటంటే... న్యూజిలాండ్ , బ్రిటన్ దేశాలు తెలంగాణ ప్రఖ్యాత పండుగ బతుకమ్మ ఫొటోతో స్టాంపులు విడుదల చేశాయి.
అయితే ఇక్కడ బతుకమ్మతో పాటు కవిత చిత్రాన్ని కూడా దాని మీద ప్రచురించాయి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇంతకీ కవిత స్టాంపును ఆ దేశాలు విడుదల చేశాయని చెప్పాలా.. లేక బతుకమ్మ స్టాంపును విడుదల చేశాయని చెప్పాలా తెలియడం లేదు.
అయితే టీఆర్ ఎస్ పార్టీ మాత్రం అప్పుడే ఈ క్రెడిట్ ను కవితక్కకు ఇచ్చేశాయి. ఎంపీ కవిత కు విదేశాలు అరుదైన గౌరవం ఇచ్చాయని ఆకాశానికి ఎత్తాయి.
కాగా, న్యూజిలాండ్‌లో ఒక డాలర్ విలువ చేసే పోస్టల్ స్టాంపు, లండన్‌లో ఫస్ట్ క్లాస్ పోస్టల్ స్టాంపుపై బతుకమ్మతో ఉన్న కవిత చిత్రాన్ని విడుదల చేశాయి.
బతుకమ్మను ఎత్తుకొన్న ఎంపీ కవిత ఫొటోతో పాటు తెలుగులోనే బతుకమ్మ శుభాకాంక్షలు అని పోస్టల్ స్టాంపులపై ఉండటం గమనార్హం.