బ్యాంకు సేవలకు జిఎస్టీ మోత ఇలా ఉంటుంది

First Published Jul 1, 2017, 1:47 PM IST
Highlights

జిఎస్టీ అమలుతో బ్యాంకులు సైతం పన్నుల మోత మోగిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రధాన బ్యాంకులు వినియోగదారుల లావాదేవీలపై 15 శాతం పన్ను విధించాయి. ఇకనుంచి జిఎస్టీ పుణ్యమా అని ఆ పన్నుల మోతను 15 నుంచి 18కి పెంచాయి. ఏ ఏ సేవలకు జిఎస్టీ కింద ఎంత మేరకు పన్నుల మోత మోగుతుందో అనే విషయాలను బ్యాంకులు ఎప్పటికప్పుడు వినియోగదారులకు మెసేజ్ ల ద్వారా షేర్ చేస్తున్నాయి.

జిఎస్టీ అమలుతో బ్యాంకులు సైతం పన్నుల మోత మోగిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రధాన బ్యాంకులు వినియోగదారుల లావాదేవీలపై 15 శాతం పన్ను విధించాయి. ఇకనుంచి జిఎస్టీ పుణ్యమా అని ఆ పన్నుల మోతను 15 నుంచి 18కి పెంచాయి.

 

2వేల రూపాయలలోపు డెబిట్‌, క్రెడిట్‌కార్డు లావాదేవీలపై పన్నును మినహాయించారు. 2016 డిసెంబర్‌ కంటే ముందు ఈ లావాదేవీలపై 15 శాతం పన్ను ఉండేది. ఇక.. 2000 రూపాయలకు పైన జరిపే లావాదేవీలపై గతంలో 15% ఉండగా.. ఇప్పుడు 18% పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

 

బ్యాంకులు అందించే సేవలపై ఇప్పటి వరకూ 15 శాతం పన్ను చెల్లిస్తున్నాం. ఇకపై 18 శాతం చెల్లించాలి. ఆర్టీజీఎస్‌, నెఫ్ట్‌ ద్వారా నగదు బదిలీకి ఇకపై 3 శాతం అదనంగా బాదుడు తప్పదు మనకు.

 

కస్టమర్లు ఏటా 50కి మించి చెక్కులు వాడితే 150 రూపాయలు చార్జీ చెల్లించడంతో పాటు సేవా పన్ను అదనంగా చెల్లించాలి. మొబైల్‌ అలర్ట్‌ సందేశాలు పంపేందుకు బ్యాంకులు ఇన్నాళ్లూ మూడు నెలలకు 15 రూపాయలు రుసుముగా వసూలు చేస్తున్నాయి. ఇక మీదట 18 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

 

మొత్తానికి ఇందుగలడందు లేడన్నట్లు అన్ని రంగాల్లో జిఎస్టీ మోత మోగుతున్నది.

click me!