బాలాపూర్, అల్వాల్ రికార్డులు బద్దలు: రూ. 60.08 లక్షలు పలికిన బండ్లగూడ లడ్డూ

By narsimha lodeFirst Published Sep 11, 2022, 6:21 PM IST
Highlights

జీహె,చ్ఎంసీ పరిధిలోని  గణేష్ వేలం పాటలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. బండ్లగూడలో ఏర్పాటు చేసిన రిచ్ మండ్ విల్లాస్ లో రూ 60.08 లక్షలకు లడ్డూను కొనుగోలు చేశారు. నిన్న అల్వాల్ లో రూ. 45.99 , 999 లకు వెంకటేష్ అనే వ్యక్తి లడ్డూ కొనుగోలు చేశారు. 

హైదరాబాద్: జీహెచ్ఎంసీ  పరిధిలోని పలు ప్రాంతాల్లో గణేష్ లడ్డూ వేలం పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. బాలాపూర్ లడ్డూను అల్వాల్ లడ్డూ బ్రేక్ చేసింది. అల్వాల్ లడ్డూ రికార్డును తాజాగా బండ్లగూడ లడ్డూ బద్దలు కొట్టింది.ఈ వేలం పాటలో రూ. 60..08 లక్షలు పలికింది లడ్డూ.

సికింద్రాబాద్ అల్వాల్ లో కనాజిగూడ మరకత గణేష్ లడ్డూ వేలం పాటను శనివారం నాడు నిర్వహించారు. వేలం పాటలో రూ. 45,99,999 లక్షలకు లడ్డూను  వెంకట్ రావు దక్కించుకున్నారు. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూను వంగేటి లక్ష్మారెడ్డి రూ. 24.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.గత ఏడాది కంటే ఐదు లక్షలు అదనంగా వేలం పాటలో పాడి లక్ష్మారెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు. చాలా ఏళ్లుగా లక్ష్మారెడ్డి ఈ లడ్డూ కోసం వేలం పాట పాడుతున్నారు. ఈ ఏడాది వేలంపాటలో లక్ష్మారెడ్డికి బాలాపూర్ లడ్డూ దక్కింది.  అయితే ఇవాళ బండ్లగూడ కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో గణేష్ మండపం ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం వేశారు. ఈ వేలం పాటలో రూ. 60..08 లక్షలు పలికింది. 

also read:బాలాపూర్‌ లడ్డూ రికార్డు బద్ధలు.. ఏకంగా రూ. 46 లక్షలు పలికిన ఆల్వాల్ కనాజిగూడ గణేశ్ లడ్డూ

హైద్రాబాద్ లో బాలాపూర్ లడ్డూ వేలం పాటకు మంచి క్రేజ్ ఉంటుంది. అయితే రెండు రోజులుగా అల్వాల్, బండ్లగూడల్లో చోటు చేసుకొన్న వేలం పాటలు రికార్డులు బద్దలు కొట్టాయి.గతంలో ఎన్నడూ లేని విధంగా గణేష్ లడ్డూల వేలం పాటల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు.బాలాపూర్ లో 1994లో లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. ఆనాడు రూ. 450లకు ప్రారంభమైన వేలం పాట ప్రస్తుతం లక్షలకు చేరుకుంది. 
 

click me!