బండ్లగణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య..

Published : Jan 09, 2024, 06:30 AM IST
బండ్లగణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య..

సారాంశం

రెండేళ్ల క్రితమే రమణ,  చందనలకు వివాహమయ్యింది. వీరిద్దరూ వివాహం అనంతరం హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇందిరానగర్ లో ఓ గది అద్దెకి తీసుకుని ఉంటున్నారు.

హైదరాబాద్ : బండ్ల గణేష్ దగ్గర చాలా ఏళ్లుగా పనిచేస్తున్న కారు డ్రైవర్ ఇంట విషాదం నెలకొంది. పెళ్లైన రెండేళ్లకే ఆయన భార్య ఆత్మహత్య చేసుకుంది. బండ్ల గణేష్ దగ్గర రమణ అనే యువకుడు కారు డ్రైవర్ గా చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య చందన తాముంటున్న  గదిలోని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల క్రితమే రమణ,  చందనలకు వివాహమయ్యింది. వీరిద్దరూ వివాహం అనంతరం హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇందిరానగర్ లో ఓ గది అద్దెకి తీసుకుని ఉంటున్నారు.

అయితే వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్నా ఆ తరువాత గొడవలు మొదలయ్యాయి. దీంతో కుటుంబ కలహాలతో మానసిక వేదన తట్టుకోలేక చందన బలవన్మరణానికి పాల్పడింది. చందన ఆత్మహత్య విషయం తెలియడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. చందన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతికి కారణాలు ఏంటి అనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి. చందన ఆత్మహత్య విషయంలో భర్త రమణ మీద వారి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్