తెలంగాణ అసెంబ్లీలో శాసనసభపక్ష నేతపై ఇంకా సస్పెన్ష్ వీడలేదు. ఈ విషయమై పార్టీ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ శాసనసభపక్ష నాయకుడి ఎంపికపై ఆ పార్టీ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది.భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య నేతల సమావేశం సోమవారంనాడు హైద్రాబాద్ లో జరిగింది.ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ తరుణ్ చుగ్ లు సమావేశమయ్యారు.
పార్టీ శాసనసభపక్ష నేత ఎంపికపై చర్చించారు. రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, వెంకటరమణ రెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చాయి. శాసనసభపక్ష నేత ఎంపిక కోసం ఎమ్మెల్యేల నుండి పార్టీ నేతలు అభిప్రాయాలను సేకరించారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించిన వెంకటరమణ రెడ్డిని శాసనసభపక్ష నేతగా ఎంపిక చేస్తే ఎలా ఉంటుందని తరుణ్ చుగ్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారని సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు శాసనసభపక్ష నేతగా అవకాశం కల్పించాలని పాయల్ శంకర్ కోరినట్టుగా తెలుస్తుంది.
also read:తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల:రెండు స్థానాలకు పోలింగ్
మరో వైపు ఎన్నికల ముందు కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉత్తర తెలంగాణకు కొందరు ఎమ్మెల్యేలు సూచించినట్టుగా సమాచారం. ఈ విషయమై పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డాతో చర్చించిన తర్వాత బీజేపీ శాసనసభపక్ష నేతపై నిర్ణయాన్ని ప్రకటించాలని పార్టీ నేతలు చెబుతున్నారు.
also read:తెలంగాణలో జిల్లాలు తగ్గుతాయా, పెరుగుతాయా?: అధికారులతో కమిటీ ఏర్పాటు యోచనలో రేవంత్
2023 నవంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. 2018 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలో విజయం సాధించింది. గోషామహల్ నుండి రాజాసింగ్ మాత్రమే విజయం సాధించారు. దుబ్బాక, హూజురాబాద్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, ఈటల రాజేందర్ లు గెలుపొందారు.
also read:కారణమిదీ: స్వంత పార్టీ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు
గత ఎన్నికల్లో గెలుపొందిన రాజాసింగ్ మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే ఈ దఫా మరో ఏడుగురు అసెంబ్లీలో అడుగు పెట్టారు. అసెంబ్లీలో అడుగు పెట్టిన వారిలో మహేశ్వర్ రెడ్డి మినహా మిగిలిన వారంతా కొత్త సభ్యులే. మహేశ్వర్ రెడ్డి గతంలో ప్రజా రాజ్యం పార్టీ నుండి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే ఎన్నికల ముందే మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరారు. గత సెషన్ లో రాజాసింగ్ శాసనసభపక్ష నేతగా కొనసాగారు.