హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

Published : May 10, 2023, 04:45 PM IST
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

సారాంశం

హైదరాబాద్‌లో మరోసారి  వర్షం దంచికొడుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 

హైదరాబాద్‌లో మరోసారి  వర్షం దంచికొడుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీ నగర్, సరూర్‌నగర్‌, ఉప్పల్‌, ఘట్‌కేసర్‌, పీర్జాదిగూడ, వనస్థలిపురం, కాప్రా, దమ్మాయిగూడ, నాగోల్‌, ఓయూ, మీర్‌పేట్, చంపాపేట్, రామంతాపూర్‌, అంబర్‌పేట్‌లో వర్షం కురుస్తోంది. ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. వర్షానికి పలుచోట్ల చెట్లు నెలకొరిగాయి. కొన్నిచోట్ల రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ జామ్ అవుతుంది.  అయితే ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు వర్షంతో ఉపశమనం లభించినట్లయింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు | Advocate Allam Nagarju On POCSO | Asianet News Telugu
Advocate Allam Nagaraju On bandi Sanjay Son Issue : అప్పుడు భగీ ..ఇప్పుడు బొగ్గు అయ్యిండా??