బండి సంజయ్ కు బెయిల్: కరీంనగర్ జైలు నుండి విడుదల

By narsimha lodeFirst Published Apr 7, 2023, 9:02 AM IST
Highlights


బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ఇవాళ  జైలు నుండి విడుదలయ్యారు.  

కరీంనగర్: టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ కుట్ర కేసులో  అరెస్టైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారంనాడు కరీంనగర్ జైలు నుండి విడుదలయ్యారు. నిన్న  హన్మకొండ  కోర్టు  బండి సంజయ్ కు  బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరి జామీనుతో పాటు రూ. 20 వేల పూచీకత్తుతో  బండి సంజయ్ కు  బెయిల్ మంజూరు చేసింది  కోర్టు. కోర్టు ఆదేశాల మేరకు  బండి సంజయ్ తరపు న్యాయవాదులు  పూచీకత్తులను సమర్పించారు. దీంతో  ఇవాళ  ఉదయం కరీంనగర్  జైలు నుండి  బండి సంజయ్ ను  విడుదల చేశారు.

టీఎస్‌పీఎస్‌సీ హిందీ పేపర్ లీక్  కేసులో  ఈ  నెల  4వ తేదీన బండి సంజయ్  ను  పోలీసులు అరెస్ట్  చేశారు.  కరీంనగర్ లో  ఉన్న బండి సంజయ్ ను  అరెస్ట్  చేసి  యాదాద్రి  భువనగరి జిల్లాలోని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు  తరలించారు.  ఈ నెల  5వ తేదీన ఉదయం  వంగరల్ కు  బండి సంజయ్ ను తరలించారు.  హన్మకొండ మేజిస్ట్రేట్  ముందు  బండి సంజయ్ ను హాజరుపర్చారు.  

also read:నీ బిడ్డ, కొడుకు జైలుకే: జైలు నుండి విడుదలయ్యాక కేసీఆర్‌పై బండి ఫైర్

బండి సంజయ్ కు  మేజిస్ట్రేట్  రిమాండ్ విధించారు. నిన్న  హన్మకొండ కోర్టులో  బండి సంజయ్ తరపు న్యాయవాదులు  బెయిల్ పిటిషన్ దాఖలు  చేశారు.ఈ పిటిషన్ పై  ఇరువర్గాల వాదనలు  విన్న  కోర్టు  బండి సంజయ్ కు  బెయిల్ మంజూరు చేశారు.   బెయిల్ మంజూరు కావడంతో  బండి సంజయ్  ఇవాళ ఉదయంబ జైలు నుండి విడుదలయ్యారు.  బండి సంజయ్ జైలు నుండి విడుదల కానున్నారనే విషయం తెలుసుకున్న ఆ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున  జైలు వద్దకు  చేరుకున్నారు.  బండి సంజయ్  విడుదల కానున్న నేపథ్యంలో  భారీ పోలీస్ బందోబస్తు  ఏర్పాటు చేశారు. 

click me!