బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు.. ఈ రోజు ఉదయం జైలు నుంచి బయటకు!

Published : Apr 06, 2023, 11:03 PM ISTUpdated : Apr 07, 2023, 07:21 AM IST
బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు.. ఈ రోజు ఉదయం జైలు నుంచి బయటకు!

సారాంశం

టెన్త్ కొశ్చన్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు బెయిల్ మంజూరైంది. హన్మకొండ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ పేపర్లు పొందిన తర్వాత రేపు ఉదయం కరీంనగర్ జైలు నుంచి అధికారులు సంజయ్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.  

హైదరాబాద్: టెన్త్ కొశ్చన్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పేపర్లు జైలు అధికారులు సమర్పించనున్నారు. ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ జైలులో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆయన జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

బండి సంజయ్‌కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది విద్యాసాగర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వరంగల్ సీపీ కౌంటర్ పిటిషన్ కూడా వేశారు. బండి సంజయ్‌ను 3 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. పదో తరగతి పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయని, బండి సంజయ్ పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని వాదించారు. ఈ కస్టడీ పిటిషన్‌ను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 

దీంతో బండి సంజయ్‌ బెయిల్ పిటిషన్ కూడా సోమవారానికి వాయిదా వేయాలని పోలీసులు వాదించారు. కానీ, వరుసగా మూడు రోజులు సెలవు వస్తున్నందున బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని సంజయ్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత హన్మకొండ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది.

Also Read: టెన్త్ పేపర్ లీక్ కేసు .. రేపు విచారణకు హాజరుకాలేను : వరంగల్ డీసీపీకి ఈటల రాజేందర్ లేఖ

డిఫెన్స్ వాదనలతో ఏకీభవించిన కోర్టు బండి సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను బెదిరించవద్దని, ఆధారాలు తారుమారు చేయరాదని పేర్కొంది. అలాగే, విదేశాలకు వెళ్లకూడదని తెలిపింది. ఇద్దరి పూచీకత్తుతో బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు చేసింది. రూ. 20 వేల పూచీకత్తు కూడా తీసుకుంది.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు